ETV Bharat / state

సింహాచలం దేవస్థానం స్థలాల్లో ఆక్రమణల తొలగింపు

author img

By

Published : Jun 30, 2021, 1:06 PM IST

Simhachalam temple sites
సింహాచలం దేవస్థానం

సింహాచలం దేవస్థాన పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను దేవస్థానం భూపరిరక్షణ సిబ్బంది తొలగించారు. వేపగుంట దరి, గోపాలపట్నం దరిలో ఆక్రమణలను తొలగించేశారు. దేవస్థానం స్థలాల్లో ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఈవో హెచ్చరించారు.

సింహాచలం దేవస్థానానికి చెందిన స్థలాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను దేవస్థానం భూపరిరక్షణ విభాగం సిబ్బంది తొలగించారు. వేపగుంట దరి దుర్గానగర్​లో అక్రమ కట్టడానికి సంబంధించిన పునాది, ఇనుప చువ్వలను తీసేయించారు. గోపాలపట్నం దరి ఇందిరానగర్​లో నిర్మించిన రేకుల షెడ్డును తొలగించారు. దేవస్థానం స్థలాల్లో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని ఈవో సూర్యకళ హెచ్చరించారు.

ఏపీఐఐసీ భూమిలో ఆక్రమణల తొలగింపు..

నరవ శివారు సత్తివానిపాలెం దరిలోని ఏపీఐఐసీ స్థలంలో వెలసిన ఆక్రమణలను రెవెన్యూ అధి కారులు సోమవారం తొలగించారు. ఓ సర్వే నంబరులో సుమారు 8 ఎకరాల ఏపీఐఐసీ స్థలంలో గతంలో కొందరు వ్యక్తులు ప్రహరీ నిర్మించారు. ఏపీఐఐసీ అధికారులు ఫిర్యాదు మేరకు నాడు రెవెన్యూ అధికారులు ప్రహరీని కొంత మేర తొలగించారు. అయితే అరకొరగా ఆక్రమణలను తొల గించారని ఆరోపణలు రావడంతో తాజాగా తహసీల్దారు రామారావు ఆదేశాల మేరకు వీఆర్వోలు సోమవారం అక్కడికి వెళ్లారు.

జేసీబీతో సుమారు మూడు ఎకరాల్లో ఉన్న ప్రహరీని తొలగించారు. పక్కనే ఉన్న ఖాళీస్థలాన్ని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు రావడంతో ఆ స్థలంలోని ప్రహరీని తొలగించారు. అనంతరం అవి ఏపీఐఐసీ స్థలాలని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

RRR: 'ఆర్​ఆర్​ఆర్'​ పోస్టర్​.. సైబరాబాద్​ పోలీసుల ట్రోల్​

దేశంలో కొత్తగా 45,951 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.