హామీలను నమ్మి గెలిపించాం.. మర్చిపోయి, మాపై కేసులు పెడుతున్నారు: ఏపీజేఏసీ అమరావతి

author img

By

Published : Mar 6, 2023, 1:57 PM IST

Updated : Mar 6, 2023, 2:54 PM IST

Etv Bharat

APJAC Amaravati : జగన్ ప్రభుత్వం ఉద్యోగ వర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలని.. ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అందుకు నిరసనగా ఈనెల 9 నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడ్డామని తెలిపారు. తమ ఉద్యమానికి ఏపీ సీపీఎస్ఈఏ మద్దతు ప్రకటించిందని వెల్లడించారు.

9 నుంచి ఏపీజేఏసీ ఆందోళన

APJAC Amaravati : జగన్ ప్రభుత్వం ఉద్యోగ వర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలని.. ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలతో సమావేశంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అర్థిక, ఆర్థికేతర సమస్యలను 4 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకు నిరసనగా ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనల నేపథ్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడ్డామని తెలిపారు. తమ ఉద్యమానికి ఏపీ సీపీఎస్ఈఏ మద్దతు ప్రకటించిందన్నారు.

హామీలను గుర్తు చేయడానికే... చట్టబద్ధంగా రావాల్సినవి‌‌, తాము దాచుకున్న డబ్బులు ఇవ్వకపోవడం... ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, మరిచిపోయిన అంశాలను గుర్తు చేయడానికే మా ఉద్యమం అని బొప్పరాజు స్పష్టం చేశారు. 11 వ పీఆర్సీ ప్రకటించినా బకాయి ఎప్పుడు చెల్లిస్తారో, ఎంత వస్తుందో బిల్లులు చేయించలేదని అన్నారు. డీఏ ఏరియర్స్ లక్షలాది రూపాయల ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని, మూడు డీఏలు ఇప్పటికీ చెల్లించలేదని గుర్తుచేశారు. రిటైర్ అయిన వారికి బకాయి చెల్లించలేదని, పోలీసులకు ఏడాదిగా సరెండర్ లీవులకు చెల్లింపులు ఇవ్వలేదని తెలిపారు. తాము దాచుకున్న జీపీఎఫ్ సంగతి ఏంటని ప్రశ్నిస్తూ.. మేం దాచుకోవడమే నేరమా.. మొత్తం 3 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీపీఎస్ ఉద్యోగులు తమ వాటా కింద రూ.1200 కోట్లు ఏమయ్యాయని, ఈ అన్యాయాలు ప్రజలందరికీ తెలియాలన్నారు.

మీరు పెన్షన్ వదులుకుంటారా... రాజకీయ నాయకులు ఎందుకు పెన్షన్ విధానాన్ని రద్దు చేసుకోగలరా అని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. వయస్సు అయ్యిపోయే వరకూ మీరేమైనా సేవ చేస్తున్నారా‌.. వారికి ఇచ్చే రాయతీలు ప్రపంచంలో ఎవ్వరూ పొందరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు 22 ఏళ్లు సర్వీస్ చేస్తున్నారని.. క్రమబద్ధీకరణ చేస్తామని నమ్మించారని, ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరిస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం జీతాలు పెంచుతామని చెప్పారే తప్ప అమలు చేయలేదన్నారు. ప్రతి ఉద్యోగి ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఐక్యతను చాటి చెప్పాలని ఏపీ ఎన్జీఓ జేఏసీ కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించింది. తన ఉద్యోగులను, కుటుంబాల ఆవేదన, ఆక్రందనను తెలియజేసేందుకే మా ఉద్యమం. చట్టబద్ధంగా మాకు రావాల్సినవి ఇవ్వకపోవడం, మేం దాచుకున్న డబ్బులు ఇవ్వకపోవడం, ఎన్నికల హామీలను విస్మరించడం అంశాలే ప్రధానంగా ఉద్యమం కొనసాగుతుంది. మాకు అందాల్సిన డీఏ.. ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకోవడాన్ని మేం ప్రశ్నిస్తున్నాం. సీపీఎస్ ఉద్యోగుల సొమ్ము కూడా లెక్క తేలడం లేదు. సీపీఎస్ పై వారంలోగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చి మర్చిపోయారు. ఇక.. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించాం. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నమ్మి జగన్ ను గెలిపించాం. కానీ, మూడేళ్లుగా తిరుగుతున్నా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. 2020 ఆగస్టు 31న సీఎం జగన్ ను కలిసినా ఇంతవరకు పరిష్కారం జరగలేదు. దేశంలో ఎక్కడా లేని జీపీఎస్ విధానాన్ని తీసుకువస్తాం అని చెప్పారు. సంవత్సర కాలంగా మా వేతనంలో కోత విధిస్తున్న 10శాతం ఇంత వరకూ మాకు చెల్లించడం లేదు. ఈ ప్రభుత్వాన్ని విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదు. సీపీఎస్ఈఏ ఉద్యోగులపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తున్నారు. - అప్పలరాజు, ఏపీ సీపీఎస్ఈఏ అధ్యక్షుడు

ఇవీ చదవండి :

Last Updated :Mar 6, 2023, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.