ETV Bharat / state

'ప్రభుత్వం చేయూతనిస్తే తప్ప ఆ రంగం కోలుకోదు'

author img

By

Published : Apr 30, 2020, 7:43 PM IST

'ప్రభుత్వం చేయూతనిస్తే తప్ప ఆతిథ్య రంగం కోలుకోదు'
'ప్రభుత్వం చేయూతనిస్తే తప్ప ఆతిథ్య రంగం కోలుకోదు'

కరోనా ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. లాక్​డౌన్​తో ఆతిథ్య రంగం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఈ రంగం తిరిగి కోలుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం చేయూతనందించాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కార్మికులకు భరోసా కల్పించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

ఆతిథ్య రంగానికి ప్రభుత్వ భరోసా ఉండాల్సిందేనన్న దసపల్లా హోటల్స్​ డైరెక్టర్​

ఆతిథ్య రంగం తిరిగి కొలుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం సహాయం అందించాలని ఆ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. లాక్​డౌన్​ ముగిశాక ఈ రంగం కేవలం 25 శాతం మాత్రమే కార్యకలాపాలను ఆరంభించగలుగుతుందని అంచనా వేస్తున్నాయి. గ్రౌండ్​ జీరో నుంచి మళ్లీ తమ కార్యకలాపాలు మొదలుపెట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈఎస్​ఐ, పీఎఫ్ సంస్థల్లో ఉన్న వేల కోట్ల రూపాయల కార్మికుల చందాలు, బీమా మొత్తాలను ఈ లాక్​డౌన్ సమయంలో కార్మికులను ఆదుకునేందుకు వినియోగించాలని పారిశ్రామిక వర్గాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. కార్మికుల భద్రతే తమకు ఎప్పుడూ ముఖ్యమంటున్న ఆతిథ్య రంగ పరిశ్రమ ప్రముఖుడు, దసపల్లా హోటల్స్​ డైరెక్టర్​ వెంకట్​తో ముఖాముఖి..!

ఇదీ చూడండి..

'దేశమంతా ఒక విధానం... ఏపీలో మరో విధానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.