ETV Bharat / state

గుజరాత్ మిల్క్ సొసైటీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది: అప్పలరాజు

author img

By

Published : Feb 18, 2023, 10:44 AM IST

Minister Sidiri
సీదిరి అప్పలరాజు

Minister Seediri Appala Raju IN Tech Summit : విశాఖ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ కాబోతుందని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. విశాఖలో జరిగిన టెక్ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో టెక్ సమ్మిట్ కీలకం కావడం సంతోషం: మంత్రి

Minister Seediri Appala Raju IN Tech Summit : విశాఖ పరిపాలన రాజధానిగా కాబోతున్న సందర్భంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో టెక్ సమ్మిట్ ఎంతో కీలకం కావడం సంతోషంగా ఉందని రాష్ట్ర మత్స్యశాఖ, పశు సంవర్ధక మంత్రి సీదిరి అప్పల రాజు చెప్పారు. విశాఖలో శుక్రవారం జరిగిన టెక్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు. గుజరాత్ మిల్క్ సొసైటీతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, ఆక్వా కల్చర్ అభివృద్ధిలో ఏపీ టెక్నాలజీ పరంగా ముందుందని అన్నారు.

ఎగుమతులు చేస్తూ రికార్డ్: అమెరికా, చైనా, ప్రాన్స్ దేశాలకు ఆంధ్రా రొయ్య పిల్లలు ఎగుమతులు చేస్తూ రికార్డ్ సృష్టించిందని ఆయన అన్నారు. ఆక్వా రంగంలో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశాలకు హబ్ గా మారిందని చెప్పుకొచ్చారు. ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని మహిళల సాధికారతకు ఆయన తోడ్పడుతుందని అన్నారు.

" రాష్ట్రంలో చాలా మంచి డెయిరీ వ్యవస్థను తయారు చేస్తున్నాం. 2 వేల పాలు నింపే కేంద్రాలు, 8 వేలకు పైగా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 8 వేలకు పైగా మహిళా కోఆపరేటివ్ డెయిరీలు స్థాపిస్తున్నాం. దీని వల్ల ఎంతో మందికి ఉద్యోగ, అవకాశాలు వస్తాయి. మహిళల సాధికారతకు తోడ్పడుతుంది. నిర్దిష్ట ప్రతిపాదనలతో రావాలని మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం చేస్తాం. ఆక్వా రంగానికీ ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్‌ కరెంట్ ఇస్తున్నాం. ఆక్వా రంగానికి అవసరమైన మద్దతును ప్రభుత్వం ఇస్తోంది. " - సీదిరి అప్పల రాజు, రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి,

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.