ETV Bharat / state

దక్షిణ కోస్తా రైల్వేజోన్​కు రూ.106.89 కోట్లు మంజూరు: అశ్వనీ వైష్ణవ్‌

author img

By

Published : Feb 10, 2023, 10:37 PM IST

Etv Bharat
Etv Bharat

Ashwini Vaishnav: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయబోయే.. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కేంద్ర కార్యాలయం, ఇతర అవసరాల కోసం 106 కోట్ల 89 లక్షలను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మించేందుకు ఇప్పటికే భూమిని గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం 3 వేల 723 కోట్ల బకాయిలు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

South Coast Railway Zone operations: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయబోయే.. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కేంద్ర కార్యాలయం, ఇతర అవసరాల కోసం 106 కోట్ల 89 లక్షలను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందుకు కోసం జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మించేందుకు ఇప్పటికే భూమిని గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. సర్వే, లేఅవుట్‌ ప్లాన్‌, సిబ్బంది నివాస కాలనీ, ఇతర అవసరమైన నిర్మాణాలకు సంబందించిన ప్రాథమిక పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. భవనాల నిర్మాణానికిగాను ప్రాథమిక అవగాహనా ప్రణాళికను సిద్దం చేశామన్నారు.

2022-23 ఏడాదిలో జోన్‌ ఏర్పాటు కోసం 7.29 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. జోన్‌ కోసం ఇప్పటికే డీపీఆర్‌ సిద్దమైందని, ప్రయాణికుల ట్రాఫిక్‌ సులభంగా కొనసాగేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా... పరిధి సమస్యలు తలెత్తుకుండా కమిటీని నియమించగా... నివేదిక అందించినట్లు రైల్వే అశ్వనీ వైష్ణవ్‌ చెప్పారు. వైసీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు భాగస్వామ్యంతో.. 17,073 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో 07 ప్రాజెక్టులను రైల్వే చేపట్టిందని, వీటిపై ఇప్పటివరకు 7,732 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ మరో ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో చెప్పారు.

ఈ ప్రాజెక్ట్‌లలో తమ వాటాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,723 కోట్ల రూపాయల బకాయి ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. 2022 ఏప్రిల్‌ 1 నాటికి రాష్ట్రంలో 31 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని... వీటిలో 16 కొత్త లైన్‌లు, 15 డబ్లింగ్ పనులు ఉన్నట్లు మంత్రి చెప్పారు. మొత్తం 5,581 కిలోమీటర్ల పొడవుకు 70,594 కోట్ల రూపాయల వ్యయంతో... చేపట్టిన పనుల్లో కొన్ని పూర్తిగా.. మరికొన్ని పాక్షికంగా, ఇంకొన్ని ప్రణాళిక, ఆమోదం వంటి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 2022 మార్చి నాటికి 19,414 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తైన 636 కిలో మీటర్ల రైల్వే లైన్లు ప్రారంభించినట్లు అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. గతంలో మోదీ విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భంగా రైల్వే జోన్‌ అంశంపై అడుగులు పడిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.