ETV Bharat / state

Nara Lokesh : తిరుమల కొండపై సినిమా పాటల ప్రదర్శన.. నారాలోకేశ్ మండిపాటు

author img

By

Published : Apr 23, 2022, 4:28 AM IST

Lokesh
Lokesh

తిరుమల కొండపై సినిమా పాటల ప్రదర్శన ఘటనపై నారాలోకేశ్ మండిపడ్డారు. గోవింద‌నామ‌స్మర‌ణ మారుమోగే తిరుగిరుల‌పై సినిమా పాట‌ల ప్రద‌ర్శన దారుణమన్నారు. ఈ అప‌చారాన్ని క‌పిపెట్టేందుకు ఏ సినిమా క‌థ సిద్ధంచేస్తారో అన్నారు.

తిరుమల కొండపై సినిమా పాటల ప్రదర్శన ఘటనపై తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేశ్ తీవ్రంగా స్పందించారు. దేవుడంటే జగన్ రెడ్డికి అంతా ఆట‌లాట‌లాగా వుందా అని ధ్వజమెత్తారు. ఏడుకొండ‌ల‌వాడి స‌న్నిధిలో సినిమా పాట‌లు ఏంటనీ మండిపడ్డారు. భ‌క్తుల‌కి న‌ర‌కం చూపుతూ ప‌విత్రత మంట‌గ‌లుపుతున్నారని దుయ్యబట్టారు. గోవింద‌నామ‌స్మర‌ణ మారుమోగే తిరుగిరుల‌పై సినిమా పాట‌ల ప్రద‌ర్శన దారుణమని ఆగ్రహాం వ్యక్తంచేశారు. ఈ అప‌చారాన్ని క‌పిపెట్టేందుకు ఏ సినిమా క‌థ సిద్ధంచేస్తారో అన్నారు. తిరుమల కొండపై సినిమా పాటల ప్రదర్శన ఘటనకు సంబంధించిన వీడియోలను లోకేశ్ విడుదల చేశారు.

  • దేవుడంటే ఆట‌లాట‌లా వుందా? ఏడుకొండ‌ల‌వాడి స‌న్నిధిలో సినిమా పాట‌లా? భ‌క్తుల‌కి న‌ర‌కం చూపుతున్నారు. ప‌విత్ర‌త మంట‌గ‌లుపుతున్నారు. గోవింద‌నామ‌స్మ‌ర‌ణ మారుమోగే తిరుగిరుల‌పై సినిమా పాట‌ల ప్ర‌ద‌ర్శ‌న దారుణం. ఈ అప‌చారాన్ని క‌వ‌ర్ చేసేందుకు రేపు ఏ సినిమాటిక్ క‌థ వినిపిస్తారో! pic.twitter.com/7G55HI6YWf

    — Lokesh Nara (@naralokesh) April 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: Lokesh On RI Incident: క్యాసినో స్టార్ విశ్వరూపం అంటే ఇదేనా?: నారా లోకేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.