ETV Bharat / state

అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు బోర్డు ఏర్పాటు

author img

By

Published : Jan 10, 2023, 10:57 PM IST

Minister Kottu Satyanarayana
దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

Endowment Minister Kottu Satyanarayana: దేవాదాయ శాఖ అర్చకుల, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ 43 ను జారీ చేసింది. ఇందుకు సంభందించిన వివరాలను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.

Minister Kottu Satyanarayana: రాష్ట్రంలో దేవాదాయ శాఖ అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు బోర్డును ఏర్పాటు చేస్తూ జీఓ 43 ను జారీ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. తమ శాఖ పరిధిలోని అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమార్థం సంక్షేమ నిధి ట్రస్టు బోర్డును ఏర్పాటు చేశామన్నారు. జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్​గా వ్యవహరించే ఈ బోర్డులో నలుగురు అధికారులు, ముగ్గురు అనధికారులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. దేవాదాయ శాఖ కమిషనర్.. సెక్రటరీ, ట్రెజరర్​గా వ్యవహరించనున్నట్లు కొట్టు తెలిపారు. రాష్ట్ర ధార్మిక పరిషత్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆగమ సలహా బోర్డుకు చైర్మన్​తోపాటు.. 12 ఆగమాలకు సంబంధించి 12 మంది సభ్యులను నియమించినట్లు వెల్లడించారు.

సత్య శ్రీనివాస అయ్యంగార్​ని బోర్డు చైర్మన్​గా నియమించామన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని పలు దేవాలయాలను రూ.249.26 కోట్ల సి.జి.ఎఫ్. నిధులతో అభివృద్ది పర్చేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోని దేవాలయాలను అభివృద్ది చేసేందుకు ఈ నిధులను వెచ్చిస్తున్నామని మంత్రి తెలిపారు. హిందూ మత ధర్మంపై విస్తృతమైన ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో త్వరలో దేవాదాయ శాఖ ఆద్వర్యంలో పీఠాధిపతులు, మఠాధిపతుల విశిష్ట సదస్సును నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.