ETV Bharat / state

వరదలు వస్తే పాములు వస్తున్నాయి.. పాఠశాల నిర్మించండి.. జగన్​ మామయ్యా!

author img

By

Published : Mar 4, 2023, 12:12 PM IST

Build School Jagan Mavayya : నాడు-నేడు పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలల అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పాఠశాలలో మౌలిక వసతులు సరిగ్గా లేక రైతు భరోసా కేంద్రాల్లో పాఠాలు చెప్తున్నారు. మరుగుదొడ్లు, తరగతి గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Jagan Mavayya
జగన్ మావయ్య

వరదలు వస్తే పాములు వస్తున్నాయి మామ.. పాఠశాల నిర్మించండి..జగన్​ మామయ్యా

Build School Jagan Mavayya : నాడు-నేడు పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంతో శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలల అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి, ఎచ్చెర్ల నియోజకవర్గం డి.మత్స్యలేశం పంచాయతీ పరిధిలో కె.మత్స్యలేశం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల నాడు-నేడు పనులు నిలిచిపోవడంతో రైతు భరోసా కేంద్రాలోనే ఉపాధ్యాయులు విద్యార్థులకు తరగతి గదులు నిర్వహించడంతో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం పంచాయతీ పేరు వినగానే వలస బాట పడుతున్న మత్స్యకారుల కుటుంబాలే గుర్తుకు వస్తాయి. ఉపాధి కోసం వలస బాట పడుతున్న మత్స్యకారులు తమ పిల్లలనైనా ఉన్నత చదువులు చదివిద్దామంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డి.మత్స్యలేశం పంచాయతీ పరిధిలో ఉన్న 5 మత్స్యకార గ్రామాల్లో కె.మత్స్యలేశం గ్రామం ఒకటి, కె.మత్స్యలేశం గ్రామంలో రెండు గదులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో 52 మంది విద్యార్థులు చదువుతున్నారు.

గత ఏడాది నాడు-నేడు పథకం ద్వారా పాఠశాల అభివృద్ధి చేస్తామంటూ హడావుడిగా పనులు ప్రారంభించిన అధికారులు బిల్లులు రాలేదంటూ పక్కకు తప్పుకున్నారు. నాడు-నేడు రెండవ విడతలో పాఠశాల అభివృద్ధికి 11 లక్షల రూపాయలు మంజూరు కాగా కేవలం 2 లక్షల 89 వేలు మాత్రమే విడుదల అయ్యాయి. ఆ తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో పునాదుల స్థాయిలోనే పాఠశాల నిర్మాణం ఆగిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని అధికారులు రైతు భరోసా కేంద్రంలోని తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ రైతు భరోసా కేంద్రం కూడా తుఫానుల సమయంలో మత్స్యకారులు తలదాచుకోవడానికి కట్టించిన తుఫాను సంరక్షణ కేంద్రంలోనే ఉంది. దీంతో సరైన సదుపాయాలు లేక మత్స్యకారి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏడాది కాలంగా రైతు భరోసా కేంద్రంలో తరగతులు నిర్వహించడంపై విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరుగు దొడ్లు, భోజనం చేసేందుకు కనీస సదుపాయాలు లేని కారణంగా 52 మంది ఉన్న పాఠశాలలో పది మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చేరారని, త్వరితగతిన పాఠశాల నిర్మాణం పూర్తి చేయకపోతే మిగిలిన వారు సైతం ప్రైవేటు పాఠశాలలో చేర్పించే దుస్థితి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు మండి పడ్డారు.

" మాకు టాయిలెట్​కి వెళ్లడానికిి బాత్రూమ్​లు లేవు. మాకు టాయిలెట్​కి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. స్కూల్ లేదు. వర్షాకాలం వస్తేమో చలి వేస్తుంది. ఎండకాలం వస్తే రోడ్డు దుమ్ము ఎగురుతుంది. " - మేనక, విద్యార్థిని

" వరదల వల్ల పాములు కూడా వచ్చెస్తున్నాయి. మాకు టాయిలెట్ వెళ్లడానికి గదులు కూడా లేవు. చదువుకోవడానికి కూడా లేవు. " - చంద్రకళ, విద్యార్థిని

" ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకూ చెప్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సాయం చేయలేము మీరు వేరే స్కూలు చేర్పించండి అని గవర్నమెంట్ స్కూలు మూసేస్తే ప్రైవేటు స్కూల్​లో చదివించుకుంటాం. " - రమేశ్‌, కె.మత్స్యలేశం

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.