ఓటు హక్కు నమోదు - సద్వినియోగంపై ఈటీవీ భారత్-ఈటీవీ-ఈనాడు అవగాహన సదస్సులు

author img

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 10, 2024, 9:44 AM IST

Updated : Jan 10, 2024, 11:21 AM IST

Eenadu_ETV_Awareness_on_Right_to_Vote

Eenadu-ETV Awareness on Right to Vote: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎలా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వివిధ అంశాలపై ఈటీవీ భారత్-ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో నిర్వహిస్తున్న ఈ సదస్సులకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఓటు హక్కు నమోదు - సద్వినియోగంపై ఈటీవీ భారత్-ఈటీవీ-ఈనాడు అవగాహన సదస్సులు

Eenadu-ETV Awareness on Right to Vote : భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎలా సద్వినియోగం చేసుకోవాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థి ఓటు హక్కును ఏ విధంగా పొందాలి అనే అంశాలపై ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు విశేష స్పందన లభిస్తోంది. ఓటు నమోదు, చైతన్యంపై ‌అవగాహన కల్పించడమే కాకుండా యువత సందేహాలను తీర్చుతూ ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటులో వారిని భాగస్వాములు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

యువత రాజకీయాల్లోకి రావాలి : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని వీవీ ఫార్మసిటికల్ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సులో విద్యార్థులు ఓటు అని అక్షర రూపంలో నిలబడి ఓటు ప్రాధాన్యతను తెలియజేశారు. అనంతరం ఓటు నమోదు చేసుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన సదస్సులో యువత రాజకీయాల్లోకి రావాలని వక్తలు సూచించారు. బాధ్యతాయుత నాయకుడ్ని ఎన్నుకుంటామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. దేశ పురోభివృద్ధిలో మేము సైతం భాగస్వాములు అవుతామని గురజాలలోని నవోదయ కళాశాల విద్యార్థులు ఓటు నమోదు చేసుకున్నారు.

రైట్​ టు ఓట్ ​- ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఉన్న యువత

ప్రజాస్వామ్య రక్షణ కోసం ఓటు హక్కు : ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఏబీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల సదస్సులో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య రక్షణ కోసం ఓటు హక్కు కలిగి ఉండాలని వక్తలు సూచించారు. కడపలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఓటు అవగాహన సదస్సులో ఓటు నమోదుకు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరిచారు.

విద్యార్థులకు దిశానిర్దేశం : యువత ఓటు నమోదు చేసుకోవడంతోపాటు దానిని సద్వినియోగం చేసుకోవడంలోనూ చురుకైన పాత్ర పోషించాలని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని సీఎస్​టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటర్‌ అవగాహన సదస్సులో వక్తలు సూచించారు. కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటు నమోదు అవగాహన కార్యక్రమంలో ఈవీఎం మిషన్‌, వీవీపాట్ల పని తీరును విద్యార్థులకు వివరించారు. ఓటు అనేది వజ్రాయుధమని దానిని ప్రలోభాలకు లొంగకుండా సక్రమంగా వినియోగించుకోవాలని అల్లూరి జిల్లా చింతపల్లి డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

బాధ్యత మరువని 102 ఏళ్ల వృద్ధురాలు

ఓటు పవర్ : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా ఓటు నమోదుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వారంతా స్వయంగా ఓటు నమోదు చేసుకున్నారు. ఓటు ప్రాధాన్యతపై ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు నిర్వహించిన కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

మాకు ఓటు హక్కు లేదు. ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు నిర్వహించిన అవగాహన సదస్సులో ఓటు విలువ తెలుసుకున్నాము. అందుకే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకు వచ్చాం. విద్యార్థులు

ఓటే నీ ఆయుధం- విడవకు నీ బ్రహ్మాస్త్రం

Last Updated :Jan 10, 2024, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.