ETV Bharat / state

Tidco Houses Lacked Security: టిడ్కో ఇళ్లలో భద్రత కరవు.. మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన విద్యుత్ తీగలు

author img

By

Published : Aug 10, 2023, 8:21 PM IST

Tidco Houses Lacked Security: ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారం.. అస్తవ్యస్త డ్రైనేజీతో ముక్కుపుటాలు పగిలేలా దుర్వాసన.. పాములు, పురుగుల బెడద.. వేలాడుతున్న విద్యుత్ వైర్లు. ఇలా టిడ్కో ఇళ్లలో వసతుల లేమితో పాటు భద్రత కరవు పిల్లలకు ప్రాణసంకటంగా మారింది. తాళాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప ప్రజలకు ఉన్న సౌకర్యాలు ఏంటి.. వారు ఎలా ఇబ్బంది పడుతున్నారో పట్టించుకునేవారే కరవయ్యారు. నెల్లూరు జిల్లాలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం చిన్నారి నిండు ప్రాణాన్ని బలిగొంది.

Tidco_Houses_Lacked_Security
Tidco_Houses_Lacked_Security

Tidco Houses Lacked Security: టిడ్కో ఇళ్లలో భద్రత కరవు.. మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన విద్యుత్ తీగలు

Tidco Houses Lacked Security: ఇక్కడ కనిపిస్తున్నది నెల్లూరులోని టిడ్కో ఇళ్ల సముదాయం. వీటిని తెలుగుదేశం హయాంలో నిర్మించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్ల విస్తరణలో భాగంగా.. నగరం పాతచెక్‌పోస్టు దగ్గర ఉన్నవారిని తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం కల్పించారు. ఇళ్లు ఇచ్చారనే మాట తప్ప ఎలాంటి వసతులు ఏర్పాట్లు చేయలేదు. చిన్నారులకు అందుబాటులో విద్యుత్తు వైర్లు, మీటర్లు చిన్నపిల్లలకు సైతం అందే ఎత్తులో విద్యుత్తు మీటర్లు.. కరెంటు సరఫరాకు అంతరాయం, బాత్రూములు, వంటగది నీరు లీక్‌ అవ్వడం.. అస్తవ్యస్త మురుగునీటి వ్యవస్థ.. పాములు ఇళ్లలోకి రావడం.. ఇలా అడుగడుగునా ఇబ్బందులతో లబ్ధిదారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక్కడికి వచ్చి ఏడాది గడుస్తున్నా కనీస వసతుల్లేక నానా అవస్థలు పడుతున్నారు.

AP TIDCO Houses: టిడ్కో భూముల అమ్మకం.. పేదల్ని కొట్టే ఇళ్లు కట్టాలా..?

Three Year Old Boy Died Due to Electric Shock: ఇళ్ల ముందు విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. కరెంట్ బోర్డులు, ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణగా తలుపులు లేవు. వీటిని పర్యవేక్షించే సిబ్బంది కూడా లేరు. విద్యుత్ తీగలే యమపాశమై ఓ చిన్నారిని చిదిమేశాయి. రాజు, ఆదిలక్ష్మి దంపతుల మూడేళ్ల కుమారుడు శివకేశవ. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇక్కడకు రాకముందు బోడిగాడితోటలో ఉండగా ప్రభుత్వం టిడ్కో ఇల్లు కేటాయించడంతో ఇక్కడకు వచ్చారు. తండ్రి కూలి పనులకు వెళ్లిపోయాడు. తల్లి ఇంటి పని చేసుకుంటోంది. శివకేశవ ఆడుకుంటూ వెళ్లి విద్యుత్తు మీటర్లను తాకాడు. వైర్లను నోట్లో పెట్టుకోవడంతో ముఖం కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Gudivada TIDCO Houses: లబ్ధిదారులకు అందని తాళాలు.. మందుబాబులకు ఆవాసాలుగా టిడ్కో ఇళ్లు

Lack of Maintenance in Tidco Houses: అధికారుల నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అక్కడ నిర్వహణ లేకపోవడం.. దానికి తోడు అధికారుల పట్టించుకోకపోవడం.. వీటి కారణంగా ఓ నిండు ప్రాణం కరెంట్ షాక్​తో బలిగొన్నా.. ఆ పేద కుటుంబాన్ని ఓదార్చే వారు కరవయ్యారు. కుమారుడ్ని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న బాధిత కుటుంబంవైపు పాలకులు కన్నెత్తి చూడటం లేదు. ఓట్ల కోసం పరుగెత్తుకుంటూ వచ్చే నాయకులు.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు.

జగన్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలేంటి? కట్టిన ఇళ్లు ఎన్ని?

Beneficiaries want to Provide Facilities in Tidco Houses: విద్యుత్ వైర్లే యమపాశమై ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచ్చెత్తింది.. ఇక్కడ నివాసం ఉండే వారంతా పేద కుటుంబాలవారే. ప్రతిరోజు కూలిపనులకు వెళ్లేటప్పుడు పిల్లలను ఇంట్లో వదిలివెళ్తారు. ఆటలాడుకుంటూ చిన్నారులు కింద ఉన్న విద్యుత్ వైర్లను, మీటర్లను పట్టుకుంటున్నారు. వైర్లు వల్ల ప్రాణాలు పోతాయని ఆ చిన్నారులకు తెలియదు.. తెలిసిన అధికారులేమో భద్రతా చర్యలు చేప్పట్టడంలేదని స్థానికులు వాపోతున్నారు. రోజు ప్రమాద అంచుల్లో బతుకుతున్నామని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి.. టిడ్కోఇళ్లలో సౌకర్యాలు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. భద్రతా సిబ్బందిని నియమించాలని వేడుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.