ETV Bharat / state

నెల్లూరు పాప హత్య కేసులో సంచలన నిజాలు.. చదువుకు అడ్డుగా ఉందని చిన్నారిని చంపిన తల్లి

author img

By

Published : Apr 5, 2023, 9:59 PM IST

Updated : Apr 5, 2023, 10:12 PM IST

Mother found guilty in murder case
చిన్నారి చంపిన తల్లి

Mother found guilty in murder case in AP: నెల్లూరులోని గుర్రాలమడుగు ఘటనలో ఏడాదిన్నర పాప అదృశ్యం, హత్య కేసులో తల్లే ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. తన ఎదుగుదలకు అడ్డుగా ఉందనే సాకుతో కన్న కూతురిని సర్వేపల్లి కాలువలో పడేసినట్లు నిందితురాలు అంగీకరించిందని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Mother found guilty in murder case: నెల్లూరు నగరంలోని గుర్రాల మడుగు ఘటనలోని ఏడాదిన్నర చిన్నారి హారిక అదృశ్యం, హత్య ఘటనలో ఆ చిన్నారి తల్లే హంతకురాలైంది. మెుదట చిన్నారిని కాలువలో పడేసిన ఆ తల్లి తరువాత ఏమి ఎరుగనట్లు పాప కనిపంచడం లేదంటూ పోలీసు కేసు పెట్టింది. పోలీసులు దగ్గరి బంధువులపై అనుమానంతో విచారణ చేపట్టారు. చివరకు పాప తల్లి అనూషనే హత్య చేసినట్లు నిర్ధారించారు.

చదువుకు అడ్డుగా ఉందని చిన్నారి చంపిన తల్లి

తన ఎదుగుదలకు అడ్డుగా ఉందని కన్న కూతుర్నే కిరాతకంగా హత్య చేసిందో కసాయి తల్లి. ఇంట్లో ఊయలలో నిద్రిస్తున్న తన ఏడాదిన్నర పాపను ఎవరో కిడ్నాప్ చేశారంటూ తొలుత ఆ తల్లి డ్రామాలాడింది. పాప కనిపించడం లేదంటూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు తల్లిని తమదైనశైలిలో విచారించడంతో అసల విషయం వెలుగు చూసింది. పాపను తానే సర్వేపల్లి కాలంలో పడేసినట్లు అంగీకరించింది. నెల్లూరు నగరం గుర్రాలమడుగు సంఘం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్రాలమడుగు సంఘం వద్ద నివాసం ఉంటున్న అనూషకు సమీప బంధువైన మణికంఠ తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. మణికంఠ రాపూరులో హోటల్ నిర్వహిస్తున్నాడు. అనుష మాత్రం భర్తతో ఉండకుండా పుట్టింట్లోనే ఉంటోంది. ఎంసీఏ చదువుతున్న అనూషకు పిల్లల్ని చూసుకోవటం కష్టంగా మారుతుందనే భావనలో ఉండేది. ఈ నేపథ్యంలో తన ఎదుగుదలకు వీరు అడ్డుగా ఉన్నారని భావించిన అనూష వారి అడ్డును తొలగించుకోవాలని నిర్ణయించుకుందని పోలీసులు వెల్లడించారు.

రాత్రి ఇంట్లో ఉయ్యాలలలో నిద్రపోతున్న చిన్న పాపను సర్వేపల్లి కాలువలో పడేసినట్లు వెల్లడంచారు. అనంతరం ఏమి తెలియనట్లు ఇంటికి వచ్చి పడుకునట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఉదయం లేచిన తరువాత తన పాప కనిపించడం లేదంటూ డ్రామాలు ఆడిందన్నారు. చుట్టుపక్కల వాళ్లను నమ్మించే ప్రయత్నం చేసిందని వెల్లడించారు. ఈ ఘటనపై అనుషయే స్వయంగా వెళ్లి పోలీసు కేసు పెట్టిందని డీఎస్పీ తెలిపారు. మెుదట దగ్గర బంధుల పనే అని అనుమానించినట్లు పేర్కొన్న డీఎస్పీ ఆ దిశగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. అనూష చెప్పె అంశాలకు పొంతన కుదరకపోవడంతో తమదైన శైలిలో విచారించగా... చివరకి తానే పాపను చంపినట్లు ఒప్పుకున్నట్లు విచారణలో వెల్లడించినట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పాప మృతదేహాన్ని ఈతగాళ్ల సహాయంతో కాలువలో నుంచి వెలికి తీశారు. అనంతరం పాప తల్లి అనూషను పోలీసులు అరెస్టు చేశారు. త్వరతిగతిన కేసును ఛేదించిన బాలాజీనగర్ పోలీసులను డీఎస్పీ అభినందించారు.

ఇవీ చదవండి:

Last Updated :Apr 5, 2023, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.