Shirdi Sai Electricals: అవినాష్ తన బినామీ సంస్థ ద్వారా దోపిడీకి తెరలేపారు:సోమిరెడ్డి

author img

By

Published : May 24, 2023, 1:21 PM IST

Updated : May 24, 2023, 1:40 PM IST

TDP Leader Somireddy

TDP Leader Somireddy on Shirdi Sai Electricals: అవినాష్ తన బినామీ సంస్థ ద్వారా దోపిడీకి తెరలేపారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్​​రెడ్డి ధ్వజమెత్తారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌తో అవినాష్‌ కోట్లు దోచేస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్‌ మీటర్ల టెండర్లు షిర్డీ సాయికి కట్టబెడుతున్నారని.. రూ.29వేలకోట్ల టెండర్లు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Leader Somireddy on Shirdi Sai Electricals: వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీ​ అధికారంలోకి రాగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన బినామీ కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ద్వారా భారీ దోపిడీకి తెరలేపారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు 78వేల కోట్ల రూపాయలు బాకీ ఉంటే, 29వేల కోట్ల రూపాయల స్మార్ట్ మీటర్ల టెండర్లు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్​కి అప్పగిస్తున్నారని ఆరోపించారు. తమ్ముడు కళ్లలో ఆనందం చూడటానికి.. ఏపీ ప్రజలు కోట్ల రూపాయల భారం మోయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డీల్ మొత్తం కడపలోని షిర్డీ సాయి ఆఫీస్​లోనే జరిగిందన్నది సుస్పష్టమని దుయ్యబట్టారు.

గూగుల్ టేక్ అవుట్ తీసుకుంటే అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో షిర్డీ సాయి కార్యాలయంలో సీఎండీ, అధికారులు సమావేశమై ధరలు నిర్ణయించారన్నది బయటకొస్తుందని సూచించారు. సీబీఐ విచారణ జరిపితే ట్రాన్స్ఫార్మర్స్ పెనాల్టీలు ఎంత మొత్తం షిర్డీ సాయి చెల్లించిందో తేలుతుందన్నారు. ఏ కంపెనీకి ఇవ్వని పెనాల్టీ రాయితీలు షిర్డీ సాయికి మాత్రమే ఎందుకిచ్చారని సోమిరెడ్డి నిలదీశారు. మరే కంపెనీ రాకుండా ట్రాన్స్ఫార్మర్స్ టెండర్లలో షిర్డీ సాయి మాత్రమే నాలుగు సంవత్సరాల నుంచి ఎలా దక్కించుకుంటుందో సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

"అవినాష్ తన బినామీ సంస్థ ద్వారా దోపిడీకి తెరలేపారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌తో అవినాష్‌ కోట్లు దోచేస్తున్నారు. స్మార్ట్‌ మీటర్ల టెండర్లు షిరిడీసాయికి కట్టబెడుతున్నారు. షిర్డీ సాయి సంస్థకు రూ.29వేల కోట్ల టెండర్లు అప్పగించారు. తమ్ముడి కళ్లలో ఆనందం కోసం జనం భారం మోయాలా?. స్మార్ట్‌ మీటర్ల డీల్‌ కడప షిర్డీ సాయి ఆఫీస్‌లోనే జరిగింది. గూగుల్​ టేక్​ అవుట్​ ద్వారా అసలు విషయం బయటకు వస్తుంది"-సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి, టీడీపీ నాయకుడు

ఈ డబ్బంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే మనీ ట్రెయిలింగ్ సీబీఐ చేస్తే.. పెద్ద మొత్తం నేరస్థుల చేతికి చేరి నేరమయమైన వ్యవహారాలకు వాడినట్లు బయటకొస్తుందని చెప్పారు. షిర్డీ సాయికి తాజాగా అప్పగిస్తున్న స్మార్ట్ మీటర్ల ధర దేశంలోనే అత్యధికమని.. మీటర్ ధర, మైంటైనెన్స్ కలిపి రాజస్థాన్​లో 7వేల 945ఉంటే, చండీఘర్​లో 9వేల 710 ఉంటే ఏపీలో మాత్రం 36వేల 975 రూపాయలుగా ఉందని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 58వేలు ఉన్న ట్రాన్స్ఫార్మర్ల ధరల్ని 3రెట్లు పెంచుకుని షిర్డీ సాయికే కట్టబెట్టారని మండిపడ్డారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో షిర్డీ సాయిపై ఉన్న 500కోట్ల రూపాయల పెనాల్టీలను సైతం మాఫీ చేశారని ఆరోపించారు.

ఇవీ చదవండి:

Last Updated :May 24, 2023, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.