రిటైర్‌మెంట్‌పై ధోనీ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్..'ఆ తలనొప్పి ఇప్పుడే ఎందుకు'!

author img

By

Published : May 24, 2023, 10:02 AM IST

Updated : May 24, 2023, 11:52 AM IST

dhoni retirement

ప్రస్తుత సీజన్​ ధోనీకి చివరిది అని అంతా భావిస్తున్న వేళ.. కెప్టెన్‌ కూల్‌ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం జరగిన ఇంటర్వ్యూలో రిటైర్‌మెంట్‌, తన జట్టు ఫైనల్‌కు చేరుకోనే అంశాలపై ధోనీ మాట్లాడాడు. ఇంతకీ అతను ఏమన్నాడంటే..

Dhoni Retirement : చెపాక్ స్టేడియంలో జరిగిన పోరులో చెన్నై టీమ్​ గెలుపొందింది. దీంతో ఈ సీజన్‌ ఫైనల్లోకి చెన్నైసూపర్‌ కింగ్స్‌ అడుగు పెట్టింది. క్వాలిఫయర్‌ -1లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి మరీ ఘనంగా తుదిపోరుకు చేరింది. దీంతో 10వ సారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది. గత సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన సీఎస్కేను.. ఆ జట్టు సారధి ఎంఎస్ ధోనీ అద్భుతంగా ముందుకు నడిపించి.. టైటిల్‌ రేసులో నిలిపాడు. అయితే ప్రస్తుత సీజన్​ ధోనీకి చివరిది అని అంతా భావిస్తున్న వేళ.. కెప్టెన్‌ కూల్‌ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం జరగిన ఇంటర్వ్యూలో రిటైర్‌మెంట్‌, తన జట్టు ఫైనల్‌కు చేరుకోనే అంశాలపై ధోనీ మాట్లాడాడు.

" ఈ ఐపీఎల్​లో సాధారణంగా 8 జట్లు పోటీ పడేవి. ఇప్పుడు ఆ సంఖ్య కాస్త పదికి చేరింది. ఐపీఎల్‌ ఓ మెగా టోర్నీ. ఇలా ఫైనల్‌కు చేరడం అనేది అంత సులువేం కాదు. రెండు నెలల కష్టం. ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యాన్ని అందించారు. గుజరాత్ టైటాన్స్‌ ఓ అద్భుతమైన టీమ్‌. ఛేదనలో వారు టాప్‌ ప్లేస్​లో ఉన్నారు. మేం టాస్‌ ఓడిపోవడం కూడా ఓ రకంగా మంచిదైంది. జడేజాకు పిచ్‌ నుంచి సహకారం లభిస్తే అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం. జడేజా బౌలింగ్‌ మ్యాచ్‌ను మార్చింది. అలాగే బ్యాటింగ్‌లోనూ మొయిన్‌తో కలిసి చేసిన భాగస్వామ్యం చాలా కీలకమైంది.

CSK VS GT : ఇక ఈ మ్యాచ్​లో మా ఫాస్ట్‌బౌలర్లూ కష్టపడ్డారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాలనేదే మా ముఖ్య ఉద్దేశం. మీలోని అత్యుత్తమ బౌలింగ్‌ను బయటకు తీసుకురండి.. నేనైనా, మా కోచింగ్‌ సిబ్బంది అయినా వారికి సూచించేది ఇదే. వికెట్‌ను బట్టి నా ఫీల్డింగ్​లో మార్పులు ఉంటాయి. ఫీల్డర్లను 2-3 అడుగులు అటూ ఇటూ మారుస్తూ ఉంటూ కాస్త విసిగించే కెప్టెన్‌గా మారిపోతా. కాస్త నావైపు చూడండి అంటూ ప్రతి ఫీల్డర్‌కు విజ్ఞప్తి చేస్తా. ఒకవేళ క్యాచ్‌ డ్రాప్‌ అయినా కూడా నా నుంచి ఎలాంటి స్పందన ఉండదు. కానీ, నా మీద ఓ కన్నేసి ఉంచండని చెబుతుంటా’’ అని ధోనీ తెలిపాడు.

ఇప్పుడే ఎందుకు..?
వచ్చే సీజన్‌లో ధోనీ ఆడతాడా? లేదా? అన్న చర్చపై కూడా ఈ సందర్భంగా స్పందించాడు. ప్రస్తుత సీజన్​లోనే రిటైర్‌మెంట్‌పై ప్రకటన చేస్తాడనే ఊహాగానాలకు తెర దించాడు. చెపాక్‌లో మళ్లీ ఆడే అవకాశాలు ఉన్నాయా..? అనే ప్రశ్నకు స్పందిస్తూ "ఇప్పుడే చెప్పలేను. ఇంకా 8-9 నెలల సమయం ఉంది. డిసెంబర్‌లో మళ్లీ మినీ వేలం ఉంటుంది. కాబట్టి, ఆ తలనొప్పిని ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నా దగ్గర కావాల్సినంత సమయం ఉంది. సీఎస్కే కోసం ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటాను. అది జట్టు కోసం ఆడటమా..? లేక బయట కూర్చోవడమా..? అనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు ఇంకా సమయం ఉంది" అని చెప్పాడు. కాగా ఈ సీజన్‌లో ఈ వేదికలో చెన్నై ఆడిన చివరి మ్యాచ్‌ ఇదే. అహ్మదాబాద్‌ వేదికగా ఐపీఎల్​ తుది పోరు జరగనుంది.

Last Updated :May 24, 2023, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.