ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : Nov 17, 2022, 2:59 PM IST

AP TOP NEWS
AP TOP NEWS

.

  • తెలంగాణలో క్యాసినో కలకలం.. ఈడీ ఎదుట వైకాపా మాజీ ఎమ్మెల్యే హాజరు
    నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లో నమోదైన క్యాసినో కేసు మరోసారి కలకలం రేపుతోంది. తెలంగాణ నేతలతో పాటు అనంతపురం వైఎస్సార్​సీపీ నేతకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్​ పార్టీ నేత గుర్నాథ్‌రెడ్డి హైదరాబాద్‌ ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సినిమాల్లో కూతురు ఎంట్రీపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు..
    తన కుమార్తె, కుమారుడు సినిమాల్లోకి రావాలనుకుంటే.. ఒక తల్లిగా, నటిగా చాలా సంతోషిస్తానని మంత్రి రోజా అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జబర్దస్త్ టీం సభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మీ ఉద్యోగం భద్రమేనా.. ఇలా చెక్ చేసుకోండి..!
    అన్ని సంస్థలూ ఉద్యోగుల పనితీరునే ప్రామాణికంగా భావిస్తాయి. పదోన్నతి, వేతనం పెంపు, కొత్త బాధ్యతలు అప్పగించడం... ఇలా దేనికైనా.. పని, నడవడికే ప్రమాణాలు. కొన్ని ప్రశ్నలకు నిజాయతీగా సమాధానమిచ్చి, స్కోరు చూసుకుంటే.. సంస్థ దృష్టిలో మీరెలాంటి ఉద్యోగులో తెలుసుకోవచ్చు. మార్పులకు సిద్ధమైతే సంస్థకు విలువైన ఆస్తిగానూ మారవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అపార్ట్​మెంట్​లో వాచ్‌మెన్ అనుమానాస్పద మృతి.. ఏం జరిగింది..?
    మంగళగిరిలో వాచ్‌మెన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓ అపార్ట్‌మెంట్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో.. ఈ అఘాయిత్యం జరిగిందని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దొంగల ముఠా కోసం 20కి.మీ ఛేజ్.. మూకదాడిలో గాయపడి చిన్నారి మృతి
    కొంత కాలంగా ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్​ను పట్టుకున్న ఊరి ప్రజలు ఆగ్రహంతో వారిని చితకబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఓ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎన్నికలకు ముందే క్యాంపు రాజకీయం! అభ్యర్థులను కాపాడుకునేందుకు ఆప్ ప్లాన్
    గుజరాత్​లో ఎన్నికలకు ముందే క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి. తమ అభ్యర్థులను రహస్య ప్రదేశానికి తరలించింది ఆమ్ ఆద్మీ పార్టీ. బుధవారం ఓ అభ్యర్థి నామినేషన్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఇలా జాగ్రత్త పడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల జోరు.. బైడెన్​కు ఇక కష్టమే!
    అమెరికా చట్టసభల్లో ఒకటైన ప్రతినిధుల సభలో నాలుగేళ్ల విరామం తర్వాత రిపబ్లికన్లు మెజార్టీ సాధించారు. ఆ పార్టీకి చెందిన కెవిన్‌ మెక్‌కార్తీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మిగిలిన రెండేళ్ల పాలనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రతినిధుల సభలోని రిపబ్లికన్ల నుంచి పలు అంశాల్లో ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
    దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.210 తగ్గి.. ప్రస్తుతం రూ.54,470 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.350 తగ్గి.. రూ.63,000 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బీచ్​లో సిక్స్​ప్యాక్‌ బాడీలతో టీమ్​ఇండియా క్రికెటర్లు.. వీడియో వైరల్
    ప్రస్తుతం న్యూజిలాండ్​ పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా క్రికెటర్లు.. ప్రపంచకప్ చేదు అనుభవాలను అధిగమించి కివీస్​తో జరగనున్న సిరీస్​లను నెగ్గాలని చూస్తున్నారు. అందుకోసం ప్రాక్టీస్​లో మునిగితేలుతున్నారు. ఖాళీ సమయాల్లో బీచ్​లో ఎంజాయ్​ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. మీరూ ఓ సారి చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ELLE అవార్డుల వేడుకలో బ్యూటీల వయ్యారాలు కేకో కేక
    ముంబయిలో ఎలే బ్యూటీ అవార్డుల వేడుక బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. బాలీవుడ్​ బ్యూటీలు దీపికా పదుకొణె, కృతి సనన్​, నర్గీస్​ ఫక్లీ సహా పలువురు బ్యూటీలు రెడ్​ కార్పెట్​పై తమ అందాలను ప్రదర్శించారు. వేడుకకు వచ్చిన వారంతా భామల వయ్యారాలు చూసి ఫిదా అయిపోయారు. ఓ మీరూ ఆ చిత్రాలు చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.