ETV Bharat / state

Lawyer: అక్రమ మైనింగ్​ను ప్రశ్నించినందుకు న్యాయవాదిపై దాడి.. పట్టించుకోని పోలీసులు

author img

By

Published : Apr 27, 2023, 8:20 PM IST

Etv Bharat
Etv Bharat

Bejawada Bar Association: కృష్ణాజిల్లా గూడూరు మండలంలో న్యాయవాది హరిరామ్​పై జరిగిన దాడిని న్యాయవాదులు ఖండించారు. అక్రమ మైనింగ్​పై ప్రశ్నిస్తే న్యాయవాదిని కొడతారా అంటూ ప్రశ్నించారు. బెజవాడ బార్ అసోసియేషన్ ప్రాంగణంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఇది న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు. కొందరు అక్రమార్కులు న్యాయవాదిపై దాడి చేస్తుంటే.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.

Advocates protest cases against a colleague: అక్రమ మైనింగ్ వ్యవహారంపై ప్రశ్నించినందుకు న్యాయవాది మీద జరిగిన దాడిని విజయవాడ బార్ అసోసియేషన్ ఖండించింది. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదులపై దాడులు, అక్రమ కేసులు పెట్టడంపై న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్రాలు స్పందించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. లేకుంటే తమ ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కృష్ణాజిల్లా గూడూరు మండలంలో న్యాయవాది హరిరామ్​పై జరిగిన దాడిని న్యాయవాదులు ఖండించారు. అక్రమ మైనింగ్​పై ప్రశ్నిస్తే న్యాయవాదిని కొడతారా అంటూ ప్రశ్నించారు. బెజవాడ బార్ అసోసియేషన్ ప్రాంగణంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు . గూడూరు మండలం, ఆకుమురులో జరుగుతున్న మట్టి తవ్వకాలపై న్యాయవాది బత్తిన హరిరామ్ ప్రశ్నించేందుకు వెళ్లారు. దీంతో అక్కడున్న కొందరు ఆయనపై దాడి చేశారని బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుందర్ చెబుతున్నారు. ఇది న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు. కొందరు అక్రమార్కులు న్యాయవాదిపై దాడి చేస్తుంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దాడికి గురైన బాధితుడు న్యాయవాది హరిరామ్ ఫిర్యాదు పరిగణలోకి తీసుకోని పోలీసులు .. దాడి చేసిన వారి ఫిర్యాదును ప్రధానంగా తీసుకొని కేసు నమోదు చేయడం సరికాదన్నారు. పోలీసుల తీరుపై గవర్నర్, సీజే, డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు సుందర్ తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.

న్యాయవాదిపై దాడికి వ్యతిరేకంగా నరసన కార్యక్రమాలు

'న్యాయవాది హరిరామ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దాడికి ప్రతిగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని న్యాయవాదులం అందరం నిర్ణయించాం. న్యాయవాదిపై జరిగిన దాడిని పోలీసులు ప్రత్యక్షంగా చూసినా పట్టించుకోలేదు. హరిరామ్ ఇచ్చిన ఫిర్యాదును తీసుకోలేదు. కానీ దాడి చేసిన వారు ఫిర్యాదు చేస్తే కేసు పెట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. నిజనిర్ధారణ చేయకుండా పోలీసులు నిర్ణయాలు తీసుకున్నారు. దాడిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం. న్యాయవాదులపై దాడిని ఖండిస్తున్నాం. దాడి విషయంలో ఐదు రోజులపాటు రిలే నిరాహార దీక్ష చేస్తాం. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం.'- సుందర్, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు

'న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బత్తిని హరిరామ్​పై దాడి చేసి... అతన్ని చెట్టుకు కట్టిన వారిని వదిలి, హరిరామ్​ మీద పోలీసులు కేసు పెట్టారు. ఈ నిర్ణయంపై బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి లేకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్తాం. గత కొంత కాలంగా న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి.'- సత్యనారాయణ మూర్తి, సీనియర్ న్యాయవాది

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.