ETV Bharat / state

స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న తాబేళ్లకు జలప్రవేశం! - Officers Released Turtles

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 3:20 PM IST

Officers Released Turtles into Musurumilli Reservoir : ఏపీ నుంచి ఒరిస్సాకు అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పోలీసులు అధికారులు ముసురుమిల్లి జలాశయంలో వడిచిపెట్టారు.

officers_release_turtles
officers_release_turtles (ETV Bharat)

Officers Released Turtles into Musurumilli Reservoir : అల్లూరి జిల్లా రంపచోడవరం ఫోక్స్ పేట వద్ద పట్టుకున్న తాబేళ్లను ముసురుమిల్లి జలాశయంలో అధికారులు విడిచిపెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నా విషయం అందరికి తెలిసిందే. భారీ సంఖ్యలో తాబేళ్లను ఒక మినీ వ్యాన్​లో తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసు అధికారులు పట్టుకొని వాటిని రక్షించారు. కోనసీమ జిల్లా నుంచి ఒడిశా రాష్ట్రానికి పెద్ద మొత్తంలో తాబేళ్లను సంచుల్లో కట్టి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న 1589 తాబేళ్లు పట్టివేత - ఇద్దరు అరెస్ట్‌ - Illegally Transporting Turtles

తాబేళ్లను ఒడిశాకు మినీ వ్యాన్​లో తరలిస్తున్నారనే సమాచారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఫోక్స్​ పేట అటవీ చెక్​ పోస్ట్​ వద్ద పోలీసు అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఒడిశా వైపు వెళ్తున్న మినీ వ్యాన్​ను చెక్​ చేశారు. అందులో పైకి ఉల్లిపాయల రవాణా చేస్తున్నట్లు పోలీసులను నమ్మించడానికి దొంగలు కుయుక్తులు పన్నారు. వాహనం మొత్తం చెక్ చేయగా చూస్తే ఉల్లిపాయల రవాణా మాటున 20 బస్తాల్లో సుమారు 1589 తాబేళ్లు అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీని విలువ సుమారు రూ. 3 లక్షల రూపాయలు ఉంటాయని పోలీస్​ అధికారులు పేర్కొన్నారు.

50 Kgs Tortoise Found Viral Video : చెరువులో 50కిలోల​ తాబేలు.. తీసుకుని గ్రామస్థుల పరార్​.. ఏడేళ్ల జైలు శిక్ష?

ఈ క్రమంలోనే పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గోదావరి జిల్లాలో అరుదుగా దొరికే ఈ తాబేళ్లను ఎక్కువగా ఒరిస్సాలో మాంసం కోసం ఎక్కువగా వాడుతారని, అందుకే వాటిని అక్కడికి తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన 1589 తాబేళ్లలో 163 మృతి చెంది ఉన్నాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మిగిలిన తాబేళ్లను ముసురుమిల్లి జలాశయంలో అధికారులు విడిచిపెట్టారు.

తాబేలుకు యాక్సిడెంట్.. ఆపై కుక్క దాడి.. 3గంటలు కష్టపడి సర్జరీ చేసిన డాక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.