ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : Nov 18, 2022, 2:59 PM IST

..

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

  • పాదయాత్ర సందర్బంగా పరిరక్షణ సమితి నేతలపై కేసు.. స్టే విధించిన హైకోర్టు
    అమరావతి రైతుల మహాపాదయాత్ర సందర్భంగా రాయవరం పోలీస్‌స్టేషన్‌లో పరిరక్షణ సమితి నేతలపై నమోదు చేసిన కేసుపై.. హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో ఉన్న అన్నపూర్ణమ్మకు 41-A నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైకాపా అరాచక పాలనను ఎదుర్కోవడానికి.. కార్యకర్తలంతా ఏకమవ్వాలి: చంద్రబాబు
    రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియా నడుస్తోందని.. వైకాపా నాయకులంతా మాఫియాగా మారారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కర్నూలు జిల్లాలో మూడో రోజు పర్యటిస్తున్న ఆయన.. నేడు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మౌర్య ఇన్‌ హోటల్‌లో జరిగిన సమావేశంలో.. 2 వేల మంది వైకాపా కార్యకర్తలు.. తెలుగుదేశంలోకి చేరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం.. "మిషన్​ ప్రారంభ్​" విజయవంతం
    భారత అంతరిక్షయాన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 3 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అంకురసంస్థ రూపొందించిన విక్రమ్‌-S రాకెట్‌.. అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మూడేళ్ల బాలుడ్ని కిడ్నాప్​ చేసేందుకు ప్రయత్నం.. పట్టుకున్న గ్రామస్థులు
    గుర్తు తెలియని ఓ వ్యక్తి విశాఖ జిల్లాలో మూడు సంవత్సరాల బాలుడ్ని కిడ్నాప్​ చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతడ్ని పట్టుకున్నారు. అతన్ని పోలీసులకు అప్పగించిన తర్వాత అసలు ట్విస్ట్​ బయటపడింది. అసలు ఏం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భీమా కోరెగావ్ కేసులో ప్రొఫెసర్ ఆనంద్​కు బెయిల్​.. కానీ..
    భీమా కోరెగావ్ కేసులో ప్రొఫెసర్​ ఆనంద్ తెల్​తుంబ్డేకు ఊరట లభించింది. ఆయనకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆయన మరో వారం వరకు బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఇంట్లోకి వచ్చేదాకా వేచిచూడొద్దు.. వారిని వెంబడించాల్సిందే!'.. ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలు
    ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు విశ్రమించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదంపై పోరుకు యావత్​ ప్రపంచం కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్ర ముఠాలకు నిధులను నిరోధించే అంశంపై దిల్లీ వేదికగా 'నో మనీ ఫర్‌ టెర్రర్‌' అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాక్​లో ఘోర​​ ప్రమాదం.. గుంతలో బోల్తాపడ్డ వ్యాన్​.. 20 మంది భక్తులు దుర్మరణం
    పాకిస్థాన్​లోని సింధ్​ ప్రావిన్స్​లో దుర్ఘటన జరిగింది. నిండా నీరు ఉన్న ఓ గుంతలో వ్యాన్​ బోల్తాపడగా అందులో ఉన్న 20 మంది భక్తులు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొంపముంచిన మస్క్​ అల్టిమేటం.. ట్విట్టర్​లో గందరగోళం.. రాజీనామాకు ఉద్యోగులు సిద్ధం
    ట్విట్టర్​ను నిజమైన వాక్‌ స్వేచ్ఛకు వేదికగా మారుస్తానంటూ చెప్పిన మస్క్‌.. ఇప్పుడు సంస్థలో తీవ్ర గందరగోళానికి కారణమయ్యారు. ఆయన తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలతో ఉద్యోగులు విసుగెత్తినట్లు తెలుస్తోంది. ఉంటారా.. వెళ్తారా.. అంటూ ఆయన జారీ చేసిన అల్టిమేటం మొదటికే మోసం తెచ్చినట్లుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కేన్​ మామపై కన్నేసిన ఐపీఎల్​ టీమ్​ ఇదే!.. మరీ అన్ని కోట్లా?
    ఐపీఎల్‌ 2023 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్‌ విడిచిపెట్టిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను కొనుగోలు చేసేందుకు పంజాబ్‌ ఫ్రాంజైజీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆదిపురుష్‌'పై కృతి ఆసక్తికర కామెంట్స్‌.. ఇదో అద్భుతమైన అవకాశమంటూ..
    'ఆదిపురుష్'సినిమా పై పలు ఆసక్తికర కామెంట్లు చేసింది హీరోయిన్ కృతి సనన్‌. ఏమందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.