ETV Bharat / state

YCP Government Breaking Rules: నిబంధనలకు పాతర.. తెలంగాణ అధికారికి 'కీ'లక పోస్టింగ్..! వైసీపీ మార్కు పాలి'ట్రిక్స్'

author img

By

Published : Aug 19, 2023, 12:37 PM IST

YCP Government Breaking Rules
YCP Government Breaking Rules

YCP Government Breaking Rules : 'వడ్డించేది మనవాడైతే చాలు.. బంతిలో ఏమూలన కూర్చుంటే ఏంటి!' అనే సామెత వైసీపీ నేతలకు అతికినట్టు సరిపోతుంది. ఉద్యోగుల హక్కుల అమలు విషయంలో సవాలక్ష నిబంధనలు వల్లెవేసే అధికారులు.. తనకు కావాల్సిన వ్యక్తుల విషయంలో అవే నిబంధనలను తొక్కుకుంటూ వెళ్తున్నారు.

YCP Government Breaking Rules: వైసీపీ నేతలు చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటున్నారు. తమ వారి కోసం నిబంధనలను తిరగరాస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో పనిచేస్తున్న వ్యక్తిని ఇక్కడికి రప్పించుకుని కీలక స్థానంలో కూర్చోబెట్టేందుకు దస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఒకరిద్దరు అధికారులు అడ్డుకున్నా.. నిబంధనలు తొలగిస్తున్నారు. 'ఎవరయ్యా అక్కడ..?! చెప్పినట్టు చేయండి' అంటూ ఉన్నతస్థానాల్లో ఉన్న నేతలు ఆదేశాలు జారీచేస్తున్నారు.

AP Govt Debt Taking Attempt Failed on Beverages Corporation: రుణ సమీకరణకు యత్నం.. మరోసారి వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురు

తెలంగాణ నుంచి ఏపీకి.. అస్మదీయులైతే చాలు ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకైనా వైసీపీ ప్రభుత్వం తెగిస్తోంది. నాలుగున్నరేళ్ల క్రితం పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి డిప్యుటేషన్ పై ఏపీకి వచ్చిన దప్పిలి దశరథరామిరెడ్డి విషయంలో ప్రభుత్వం యథేచ్ఛగా నిబంధనలకు పాతరేస్తోంది. తెలంగాణాలో జైళ్ల శాఖలో పనిచేస్తున్న ఆయన్ను ఏపీకి అడిగి తెచ్చుకున్న వైసీపీ ప్రభుత్వం(YSRCP Government)... తాజాగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ హోదా కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. జైళ్ల శాఖలో భర్తీ అయిన ఓ అధికారిని పురపాలక శాఖలోకి అడాప్షన్ ప్రక్రియలో భాగంగా నిబంధనల్ని మార్చేసేందేందుకు దస్త్రాలు సిద్ధం చేసేసింది. త్వరలోనే ఆయన్ను విశాఖకు మున్సిపల్ కమిషనర్ గా నియమిస్తారన్న చర్చ జరుగుతోంది. కావాల్సిన వ్యక్తులైతే చాలు నిబంధనల్ని తుంగలో తొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం వెనుకాడటం లేదు.

సజ్జల ఓఎస్డీగా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణా జైళ్ల శాఖ నుంచి ఏపీకి వచ్చిన ఆ శాఖ ఉన్నతాధికారి దప్పిలి దశరథరామిరెడ్డి విషయంలో ప్రభుత్వం యథేచ్ఛగా నిబంధనలకు పాతరేస్తోంది. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఆయన.. ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖలో స్పెషల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఓఎస్డీగా పనిచేస్తున్నారు. తెలంగాణ జైళ్ల శాఖలో పనిచేస్తున్న ఆయన్ను.. అధికారంలోకి రాగానే ఏపీకి అడిగి మరీ తెప్పించుకున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పురపాలక -పట్టణాభివృద్ధి శాఖలోని స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ హోదా కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు జైళ్ల శాఖ నుంచి పురపాలక శాఖకు అడాప్షన్ చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అడ్డొచ్చే అరకొర నిబంధనల్ని మార్చేసి ఆయనకు పురపాలక శాఖ(Municipal Administration)లో స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ హోదా కట్టబెట్టాలని దస్త్రాలు సిద్ధం చేశారు.

Promises To AP: కేంద్రం ఇచ్చిన హామీలు.. రాబట్టడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం

అడాప్షన్ దస్త్రాలు.. జైళ్ల శాఖ అధికారి అయిన దశరథ రామిరెడ్డి(Dasharatha Ramireddy)ని పురపాలక శాఖలో అడాప్ట్ చేసేందుకు అవసరమైన దస్త్రాన్ని సిద్ధం చేయగా... ఇప్పటికే మూడు మార్లు తిరస్కరణకు గురైనట్టుగా తెలుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని ఓ దఫా మున్సిపల్ శాఖ మంత్రి, మరో రెండు దఫాలు ఆర్థిక శాఖలోని ఇద్దరు ముఖ్యమైన అధికారులు దీన్ని తిరస్కరించారు. అయితే ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడితో పాటు పురపాలక శాఖలో ఉన్న ఓ ఉన్నతాధికారి ఆజ్ఞల మేరకు మరోమారు ఈ అడాప్షన్ దస్త్రాన్ని(Adoption file) ముఖ్యమంత్రికి పంపించినట్టు తెలుస్తోంది.

Miscalculations to CAG : కాగ్​ వద్ద కూడా రాష్ట్ర ప్రభుత్వ అంకెల గారడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.