ETV Bharat / state

Miscalculations to CAG : కాగ్​ వద్ద కూడా రాష్ట్ర ప్రభుత్వ అంకెల గారడీ

author img

By

Published : Jul 12, 2023, 10:06 AM IST

AP Govt Miscalculations to CAG: రాష్ట్ర ప్రభుత్వం చెప్పొదొకటి చేసేది మరొకటి. ఈ సూత్రాన్ని ఆర్థిక అంశాల్లోనూ చొప్పించింది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం అందులోనూ అంకెలగారడీ చేస్తోంది .ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు కాగ్‌ వెల్లడిస్తున్న వివరాలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. ఏ రుణం ఎక్కడ తెస్తున్నారో.. ఏ అప్పు ఎప్పుడు తీరుస్తున్నారో అంతుచిక్కడం లేదు.

Miscalculations to CAG
కాగ్​

రాష్ట్ర ప్రభుత్వ అప్పుల లెక్కల్లో లోపించిన పారదర్శకత

AP Government submitted Miscalculations to CAG: అందినకాడికి ఇష్టానుసారం అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కాగ్‌కు సైతం తప్పుడు లెక్కలే చెబుతోంది. రాష్ట్రానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్, మే నెల లెక్కలను కాగ్‌ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. రిజర్వ్‌ బ్యాంకు ప్రతి మంగళవారం ఆయా రాష్ట్రాల అప్పులకు సంబంధించిన అప్పుల వివరాలను.. వెల్లడిస్తుంది. ఈ రెండింటినీ పోల్చి చూస్తే విస్తుపోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో కాగ్‌కు సమర్పించిన వివరాల ప్రకారం 23వేల 548 కోట్లు రుణంగా తీసుకున్నట్లు తెలిపింది.

నికర ప్రజారుణం 7వేల801 కోట్లు కాగా... నికర పబ్లిక్‌ ఎకౌంట్‌ నుంచి 10వేల767 కోట్లు కలిపి ఇంత మొత్తం సమీకరించినట్లు... వెల్లడించింది. మే నెలకు వచ్చేసరికి మొత్తం అప్పు 25 వేల12 కోట్లుగా చూపారు. మేలో ఆర్‌బీఐ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలోనే రాష్ట్ర ప్రభుత్వం 9వేల500 కోట్ల అప్పు తెచ్చుకుంది. కానీ ఏప్రిల్‌ కన్నా మే నెలలో కేవలం 1,744 కోట్ల రుణం మాత్రమే తీసుకున్నట్లు కాగ్‌కు ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్, మే రెండు నెలలు కలిపి బహిరంగ మార్కెట్‌ రుణమే 15వేల500 కోట్లు సమీకరించింది. ప్రజారుణం ప్రకారం ఇంకా వివిధ రూపాల్లో ప్రభుత్వం వినియోగించుకునే మొత్తాలు ఉంటాయి.

అలాంటిది నికర ప్రజారుణాన్ని ప్రభుత్వం14వేల548కోట్లుగామాత్రమే చూపింది. ప్రజా ఖాతా నుంచి రుణంగా చూపిన మొత్తం మాత్రం..... ఏప్రిల్‌కు మే నెలకు మధ్య 5వేల కోట్లు తగ్గించింది. పీడీ ఖాతాలతోనే.... ఇదంతా సాగుతోందని, పారదర్శకత లేకుండా అనేక సందేహాలకు తావిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

ఆర్‌బీఐ నుంచి 9వేల 500కోట్ల రుణం తీసుకొచ్చి..కాగ్‌కు ఇచ్చిన నివేదికలో మాత్రం 17వందల 44 కోట్లుగానే చూపారంటే ఏ రుణాన్ని తగ్గించి చూపారు? ఏ అప్పులు తీర్చేశారన్నది ఫజిల్‌గా మారింది. 2022 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం రాబడులను లక్షా 30వేల181 కోట్లుగా, ఖర్చును లక్షా 81 వేల680 కోట్లుగా తెలిపింది. మార్చి నెలాఖరుకు ఆదాయం లక్షా 50వేల 552 కోట్లకు పెరిగితే.. ఖర్చు లక్షా 75వేల536కోట్లకు తగ్గిపోయిందని లెక్కలు చెప్పింది.

ఖర్చుఎలాతగ్గిందన్నది అంతుచిక్కని ప్రశ్నే. 2022 ఫిబ్రవరి నాటికి ఏపీ 51 వేల112 కోట్ల అప్పు తీసుకున్నట్లు లెక్కలు చూపితే తర్వాత నెలకే అప్పు 25,012 కోట్లకు తగ్గిపోయింది. మరిన్ని అప్పులు కావాలని కేంద్ర అనుమతుల కోసం ఆపసోపాలు పడుతున్న అధికారులు.. ఒక్క నెలలోనే అంత రుణం ఎలా తీర్చేశారన్నది అనుమాస్పందం. 2023 ఫిబ్రవరిలో 60వేల707 కోట్లు అప్పు ఉంటే తరువాత నెలకే అది 51వేల453 కోట్లకు తగ్గిపోయింది. ఫిబ్రవరి కంటే మార్చి నెలాఖరుకు రాబడి 18 వేల కోట్లకు పైగా పెరిగితే..కేవలం 8 వేల కోట్లే ఖర్చు చేసినట్లు చూపించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.