ETV Bharat / state

నేడే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

author img

By

Published : Mar 13, 2021, 4:49 AM IST

Updated : Mar 14, 2021, 3:20 AM IST

నేడే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
నేడే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

నేడు జరగనున్న ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు స్థానాల నుంచి 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత రంపచోడవరం, ఎటపాక, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో........మధ్యాహ్నం 2 గంటల వరకే నిర్వహిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో ఓటు వేసే వారు......పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే ఊదారంగు మాత్రమే ఉపయోగించాలని....రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయ్‌కుమార్ సూచించారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో.....30 వేల 927 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని వెల్లడించారు. మొత్తం 227 కేంద్రాల్లో 2 వేల 200 మంది సిబ్బంది, 2 వేల 400 మంది పోలీసులు విధుల్లో ఉంటారని తెలిపారు.

ఇవీ చదవండి

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డబ్బు పంచుతున్న ఉపాధ్యాయుడు అరెస్ట్

Last Updated :Mar 14, 2021, 3:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.