ETV Bharat / state

Chandrababu review: 'భవిష్యత్​కు గ్యారెంటీ'.. వచ్చే నెలలో చంద్రబాబు జిల్లాల పర్యటనలు

author img

By

Published : Jun 28, 2023, 9:01 PM IST

పార్టీ నాయకులతో చంద్రబాబు సమీక్ష
పార్టీ నాయకులతో చంద్రబాబు సమీక్ష

Chandrababu review: భవిష్యత్​కు గ్యారెంటీ కార్యక్రమంపై ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారం నుంచి భవిష్యత్ కు గ్యారెంటీపై జిల్లాల్లో పర్యటనలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలకు ఇంచార్జిల నియామకం, నేతల పనితీరుపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Chandrababu conducted a review: నియోజకవర్గాలకు ఇంచార్జ్​ల నియామకం, నేతల పనితీరు పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నాయకుల మధ్య విభేదాల పరిష్కారం, పార్టీలో చేరికలు, భవిష్యత్​కు గ్యారెంటీపై ప్రచార కార్యక్రమం వంటి అంశాలపై చర్చించారు. వర్గ పోరు ఉన్న స్థానాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలపై చర్చలో గోపాలపురం ఇంచార్జ్ వెంకటరాజు, పార్టీ నేత బాపిరాజుతో భేటీ అయ్యారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్​సీవీ నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. భవిష్యత్​కు గ్యారెంటీ కార్యక్రమంపై జిల్లాల పర్యటనలకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారం నుంచి భవిష్యత్​కు గ్యారెంటీపై జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. యువగళం పాదయాత్ర ఒకవైపు.. భవిష్యత్ కు గ్యారెంటీపై చంద్రబాబు ప్రచార యాత్రలు మరోవైపు ఉండనున్నాయి. ఇప్పటికే ఐదు జోన్లలో భవిష్యత్ కు గ్యారెంటీ నేతల చైతన్య రథయాత్రలు కొనసాగుతున్నాయి.

స్వాతి రెడ్డికి సంఘీభావం... ప్రవాసాంధ్రురాలు స్వాతి రెడ్డి తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి తన సంఘీభావం తెలిపారు. వైఎస్సార్సీపీ చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటానికి ఆయన తన మద్దతు తెలిపారు. భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ వైఎస్సార్సీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. అసత్యాలతో భయపెట్టే వ్యూహాలు స్వాతిరెడ్డి వంటి బలమైన వ్యక్తుల సంకల్పాన్ని దెబ్బతీయలేవని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో బస్సుయాత్రలు: రాష్ట్రంలో విశాఖ పశ్చిమ, రాజమహేంద్రవరం, గురజాల, కోవూరు, రాయదుర్గం నియోజకవర్గాల్లో తెదేపా బస్సు యాత్రలు జోరుగా సాగుతున్నాయి. విశాఖలో ఇంటింటికి భవిష్యత్‌కు గ్యారెంటీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు ఇస్తూ.. యాత్రను కొనసాగించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. జగన్‌ పాలనలో ఇప్పటి వరకు 8 సార్లు కరెంటు బిల్లులు పెరిగాయని తెదేపా నేత వంగలపూడి అనిత మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో టిడ్కో లబ్ధిదారులతో కలిసి తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. రాజమహేంగ్రవరంలో 5వేల 400 టిడ్కో గృహాలు నిర్మిస్తే వైకాపా ప్రభుత్వం రంగులు మార్చింది తప్ప.. లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వలేదని.. బుచ్చయ్య విమర్శించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోనూ బస్సు యాత్ర కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే యరపతినేని, జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి సెల్ఫీ ఛాలెంజ్​లో పాల్గొన్నారు.

తెలుగుదేశం చేపట్టిన భవిష్యత్‌కు గ్యారెంటీ చైతన్య యాత్ర.. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోనూ సాగుతోంది. తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ..... వైకాపా వైఫల్యాలను ఎండగడుతూ మందుకు సాగుతోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోకి మరో ప్రచార రథం ప్రవేశించింది. తెదేపా నేతలు, నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన కాలువ శ్రీనివాసులు, పార్థసారథి, తెదేపా మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డిలు యాత్రలో పాల్గొన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పరిటాల సునీత అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.