ETV Bharat / state

రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటిన రియల్ హీరో సోనూసూద్

author img

By

Published : Sep 29, 2020, 11:28 PM IST

sonusood
రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటిన రియల్ హీరో సోనూసూద్...

కరోనా కాలంలో వేలాది మంది వలస కూలీలను ఆదుకున్న రీల్ కమ్ రియల్ హీరో సోనూసూద్​.. టాలీవుడ్ దర్శకుడు ఇచ్చిన గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ను స్వీకరించారు. రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటి.. హరిత సవాల్​ ఆలోచనకు శ్రీకారం చుట్టిన తెరాస ఎంపీ సంతోశ్ కుమార్​కు అభినందనలు తెలిపారు.

తెలంగాణలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్​ ప్రారంభించిన మూడో విడత గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో సినీ నటుడు సోనూసూద్​ పాల్గొన్నారు. దర్శకుడు శీనువైట్ల ఇచ్చిన గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ను స్వీకరించిన సోనూ.. రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటారు.

లాక్​డౌన్​ తర్వాత పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగిందన్న సోనూ.. చెట్లు నాటడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో లక్షలాది మంది ఈ సవాల్​ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సోనూ పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

'ప్రతి రోజూ పదివేల మంది భక్తులకు అనుమతి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.