ETV Bharat / state

Best Available Schools Scheme : 'బీఏఎస్‌' పథకం రద్దుకు జగన్‌ సర్కార్​ యత్నం.. విధి లేక కొనసాగిస్తూ నిర్ణయం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2023, 10:51 AM IST

Best Available Schools Scheme : బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్స్‌ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ (SC, ST) విద్యార్థులకు పథకాన్ని అమలు చేయాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

best_available_schools_scheme
best_available_schools_scheme

Best Available Schools Scheme : 'బీఏఎస్‌' పథకం రద్దుకు సీఎం జగన్‌ యత్నం.. విధి లేక కొనసాగిస్తూ నిర్ణయం

Best Available Schools Scheme : బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్స్‌ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ (SC, ST) విద్యార్థులకు పథకాన్ని అమలు చేయాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం 2021-22లో 3 నుంచి 8 తరగతులు చదివిన విద్యార్థులకు పదో తరగతి వరకు పథకం కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Nadendla Manohar Challenged Minister Botsa Satyanarayana: "టోఫెల్ అక్రమాలపై మంత్రి బొత్సతో బహిరంగ చర్చకు సిద్ధం"

సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్స్‌ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను కార్పొరేట్, ప్రైవేటు పాఠశాల్లో చదివించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని రద్దుచేసేందుకు సీఎం జగన్‌ చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు పథకాన్ని కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వం వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (Special Leave Petition) ను సుప్రీంకోర్టు ఈ నెల 3న డిస్మిస్‌ చేసింది. తర్వాత కూడా ప్రభుత్వం 17 రోజులు జాప్యం చేసి ఇక విధిలేక పథకాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమశాఖ శుక్రవారం ఉత్తర్వులివ్వగా... తాజాగా అవి వెలుగులోకి వచ్చాయి. ఈ పథకం కింద ఎంపికై 2021-22 విద్యాసంవత్సరంలో 3 నుంచి 8వ తరగతి వరకు వివిధ కార్పొరేటు, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ (SC, ST) విద్యార్థులకు పదో తరగతి పూర్తయ్యేవరకూ పథకం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మొత్తంగా రెండున్నరేళ్లుగా ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు ఈ పథకాన్ని అందకుండా చేసేందుకు జగన్‌ చేసిన కుటిల ప్రయత్నాలకు అడ్డుకట్టపడింది.

TDP MLC Bhumireddy: "ప్రథమ స్థానంలో ఉన్న విద్యావ్యవస్థ.. జగన్​ పాలనలో చివరికి"

మళ్లీ హైకోర్టుకు.. 'నా ఎస్సీ, నా ఎస్టీ'’ అంటూ వారిపై అపారమైన ప్రేమ ఒలకబోసే సీఎం జగన్‌కు.. వారిపై నిజంగా ఎంత మమకారం ఉందో తెలుసుకునేందుకు బీఏఎస్‌ పథకం ఒక్కటి చాలు. ఎందుకంటే అధికారం చేపట్టగానే ఈ పథకాన్ని రద్దుచేసేందుకు ఆయన నడుంకట్టారు. జగన్‌ ప్రభుత్వం 2020లో ఈ పథకాన్ని నిలిపేయాలని మెమో జారీ చేసే నాటికి 42వేల మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో చదువుతున్నారు. వారి పరిస్థితేంటనీ ఆలోచించలేదు. ఎస్సీ, ఎస్టీ సంఘాలు కోర్టును ఆశ్రయిస్తే.. స్టేటస్‌ కో వచ్చినా వెనక్కి తగ్గని జగన్.. పథకాన్ని 9, 10 తరగతులకే పరిమితం చేస్తూ జీవో జారీచేశారు. ఈ జీవోపై సంఘాలు మళ్లీ హైకోర్టుకు వెళ్లడంతో 2021-22 నాటికి ఈ పథకంలో ఉన్న విద్యార్థులందరికీ పదో తరగతి పూర్తయ్యేవరకూ కొనసాగించాలని ఏకసభ్య ధర్మాసనం (Single Judge Bench) తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచికి, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లింది.

Single Major Subject in Degree : డిగ్రీలో సింగిల్ సబ్జెక్ట్.. పేద విద్యార్ధుల అవకాశాలపై ఎఫెక్ట్..!

ఏటా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య.. పథకాన్ని నిలిపేయాలనే జగన్‌ నిర్ణయంతో ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య 2020-21 నుంచి ఏటా తగ్గుతూ వస్తోంది. ఉదాహరణకు 2020-21లో శ్రీకాకుళం జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 190 మంది బీఏఎస్‌ పథకం (BAS Scheme) కింద చదివేవారు. కానీ, ప్రస్తుతం అక్కడ 60 మంది మాత్రమే ఉన్నారు. 2021-22 ఏడాది నుంచి ఆ పాఠశాలకు ప్రభుత్వం బకాయిల్ని విడుదల చేయకపోగా.. దాదాపుగా కోటి రూపాయల వరకు చెల్లించాలని యాజమాన్యం వాపోతోంది. రాష్ట్రంలో చాలా పాఠశాలల పరిస్థితి ఇలాగే ఉంది.

ఒక్కో విద్యార్థిపై ఖర్చు.. 1995లో తెలుగుదేశం (Telugu Desam)హయాంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వమే ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గుర్తించి పేరున్న కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో చదివించేది. ఇలా 1వ తరగతి నుంచే ఈ పథకాన్ని అమలు చేశారు. ఎస్సీ విద్యార్థులను 1, 5 తరగతుల్లో, ఎస్టీ విద్యార్థులను 3, 5, 8 తరగతుల్లో బెస్ట అవైలబుల్ పథకానికి ఎంపిక చేసేవారు. మొదట్లో ఒక్కో విద్యార్థిపై 2 నుంచి 3 వేల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేసేది. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ప్రభుత్వాలు ఇచ్చే ఆర్థిక సాయమూ పెరిగింది. వసతి సౌకర్యం కోరుకుంటే 30వేల రూపాయలు, డేస్కాలర్స్‌కు 20వేలు చొప్పున ఒక్కో విద్యార్థి తరఫున ప్రైవేటు బడులకు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చెల్లించింది. ఇలా దాదాపుగా 10వేల మందిని చదివించింది. జగన్‌ అధికారంలోకి రాకముందు వరకు ఈ పథకం లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడింది.

భావి ప్రపంచంతో పిల్లలు పోటీపడి నెగ్గేలా అడుగులు: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.