ETV Bharat / state

నా అక్కాచెల్లెమ్మలు అంటూ ముద్దులతో ముంచెత్తిన జగన్ హామీలను గాలికొదిలేశారు: అంగన్వాడీలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 9:12 AM IST

Anganwadis Problems Not Solve The Jagan Government: ఎన్నికల ముందు నా అక్కాచెల్లెమ్మలు అంటూ ముద్దులతో ముంచెత్తిన ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే హామీలను గాలికొదిలేశారని అంగన్వాడీలు విమర్శించారు. వేతనాల పెంపునకు ఇది సమయం కాదంటూ మంత్రి ఉష శ్రీచరణ్‌ చేసిన వ్యాఖ్యలను అంగన్వాడీలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పదిరోజులుగా సమ్మె చేస్తున్నా స్పందించని ప్రభుత్వం తమను భయపెట్టాలని చూస్తోందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

anganwadis_problems_not_solve_the_jagan_government
anganwadis_problems_not_solve_the_jagan_government

నా అక్కాచెల్లెమ్మలు అంటూ ముద్దులతో ముంచెత్తిన జగన్ హామీలను గాలికొదిలేశారు: అంగన్వాడీలు

Anganwadis Problems Not Solve The Jagan Government: ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించేవారిని, సమస్యల కోసం గొంతెత్తేవారి గళాన్ని అణచివేయడం జగన్‌ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. హామీలు నెరవేర్చాలని సమ్మెబాట పట్టిన అంగన్​వాడీలపై ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోంది. పదిరోజులుగా సమ్మె చేస్తున్నా స్పందించని ప్రభుత్వం తమను భయపెట్టాలని చూస్తోందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 10వ రోజైన గురువారం అంగన్​వాడీలు నిరసనలను తీవ్రతరం చేశారు.

Anganwadis Strike For Realization Of Demands: డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 10వ రోజు ఉద్ధృతంగా సాగింది. సీఎం జగన్‌ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసనలతో హోరెత్తించారు. విజయవాడలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు వ్యవసాయ, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. అంగన్వాడీలకు వేతనాలు పెంచలేని ప్రభుత్వం, సలహాదారులను మాత్రం నియమించి లక్షల్లో వేతనాలు చెల్లిస్తోందని మండిపడ్డాయి. మైలవరం స్థానిక ఎండీవో కార్యాలయం వద్ద అంగన్వాడీలు చెవిలో పూలు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులకొట్టి నిర్వహణ బాధ్యతలను మహిళా సంరక్షణ కార్యదర్శులకు అప్పగించారు. అయినప్పటికీ పిల్లలను కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు సుమూఖత చూపలేదు. తెనాలిలో ఓ సర్పంచ్ భర్త అంగన్వాడీ కేంద్రం తాళం పగులకొట్టి అధికారులకు అప్పగించడం వివాదానికి దారి తీసింది. ఈ నెల 26 నుంచి అంగన్వాడీల సమ్మెకు ప్రత్యక్ష మద్దతు ఇవ్వనున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి.

వైఎస్సార్​సీపీ నేతలకు కేకులు, మాకు గడ్డి పోచలా?! - సీఎం జగన్​పై అంగన్వాడీల ఆగ్రహం

Anganwadis Strike In Not Respond Authority: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన చేపట్టారు. పది రోజులుగా సమ్మె చేస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. సమస్యలను మొరపెట్టుకుందాం అనుకుంటే ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనపడటం లేదంటూ సింగనమలలో అంగన్వాడీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్రాల తాళాలను పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు ప్రజా నాట్య మండలి మద్దతు తెలిపింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో అంగన్వాడీలు మానవహారంగా ఏర్పడి.. నిరసన తెలిపారు. ఎన్నికల ముందు అక్కాచెల్లెమ్మలు అంటూ ముద్దులతో ముంచెత్తిన ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా చేశారు. ఒక్క ఛాన్స్‌ అంటూ మోసగించావని పాట పాడారు.

సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దింపుతాం: అంగన్వాడీలు

Anganwadis Strike In All Districts In AP: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో భిక్షాటన చేస్తూ అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. ఆందోళనలపై సీఎం జగన్‌ స్పందించకపోవడం దారుణమన్నారు. అల్లూరి జిల్లా చింతపల్లిలో అంగన్వాడీలు నిరసన తెలిపారు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వ నిరంకుశ ధోరణిని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం నాగావళి నదిలో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. ఆమదాలవలస తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.

పత్తికొండలో తీవ్ర ఉద్రిక్తత - మంత్రి బుగ్గనకు అంగన్వాడీల వినతిపత్రం

Minister Usha Sricharan Comments In Anganwadis Strike: వేతనాల పెంపునకు ఇది సమయం కాదంటూ మంత్రి ఉష శ్రీచరణ్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అంగన్‌వాడీ సిబ్బంది నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటల నుంచి 11.30 వరకు రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ కార్యకర్తలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వం స్పందించకుంటే సీఎం జగన్ నివాసాన్ని ముట్టడిస్తాం: అంగన్వాడీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.