ETV Bharat / state

సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దింపుతాం: అంగన్వాడీలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 8:56 AM IST

Anganwadis Strike for Realization Of Their Demands: ముఖ్యమంత్రి జగన్ అనుచిత వైఖరి మారే వరకు పోరాటం వీడేది లేదని అంగన్వాడీలు పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దింపుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని తొమ్మిది రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి, మంత్రులకు చీమకుట్టినట్లు కూడా లేదని అంగన్వాడీలు మండిపడ్డారు.

anganwadis_strike_for_realization_of-_their_demands
anganwadis_strike_for_realization_of-_their_demands

సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దింపుతాం: అంగన్వాడీలు

Anganwadis Strike for Realization Of Their Demands: తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజూ ఉద్ధృతంగా సాగింది. జగన్‌ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసనలతో అంగన్వాడీలు హోరెత్తించారు. విపక్షాలు, ప్రజాసంఘాలు సంఘీభావంగా ఆందోళనల్లో పాల్గొన్నాయి. సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో తొమ్మిది రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి, మంత్రులకు చీమకుట్టినట్లు కూడా లేదని అంగన్వాడీలు మండిపడ్డారు.

YSRCP Government Not Solve Anganwadi Problems: కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా సింగనమల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు వంటావార్పు నిర్వహించారు. అనంతరం రోడ్డుపై నిలబడి భోజనం చేశారు. నంద్యాల జిల్లా మహానందిలో అంగన్వాడీలు యాచకుల వేషధారణతో దుకాణాల వద్ద భిక్షాటన చేశారు. ప్రభుత్వం అంగన్వాడీలను అడుక్కుతినేలా చేసిందని ఆవేదన వ‌్యక్తం చేశారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలపై మొండి వైఖరి విడనాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. నంద్యాల జిల్లా డోన్‌లో జోలి పట్టుకుని యాచిస్తూ నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వంటావార్పు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీలు డబ్బాలు చేత పట్టుకుని భిక్షాటన చేశారు. కోవూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద వంటావార్పు నిర్వహించారు.

పత్తికొండలో తీవ్ర ఉద్రిక్తత - మంత్రి బుగ్గనకు అంగన్వాడీల వినతిపత్రం

Congress Party Supports In Anganwadi Protests: తమ సమస్యలపై చిన్నచూపు చూస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ తమను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. వారికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది. అనంతపురం జిల్లా సింగనమల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వంటావార్పు నిర్వహించారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అంగన్వాడీలు మండిపడ్డారు.

కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన - మద్దతు తెలుపుతున్న రాజకీయ పార్టీలు

Anganwadis Strike In All Districts In AP: విశాఖలోని GVMC గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు భిక్షాటన చేశారు. ప్రభుత్వం కనీస వేతనం చెల్లించకుంటే భిక్షాటన చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా గొలుగొండలో అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహించారు. నర్సీపట్నంలో నిరసన ప్రదర్శన అనంతరం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రధాన రహదారిపై అంగన్వాడీలు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దింపుతామని హెచ్చరించారు.

అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టిన అధికారులు - సమ్మె అణచివేతకు ప్రభుత్వం యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.