వైసీపీ నేతలకు కేకులు, మాకు గడ్డి పోచలా?! - సీఎం జగన్​పై అంగన్వాడీల ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 1:50 PM IST

thumbnail

Anganwadis continue strike on 10th day: ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా, వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు కేక్ తిని సంబరాలు చేసుకుంటున్నారని, సీఎం జగన్ మాత్రం తమకు గడ్డి తినిపిస్తున్నాడని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా డోన్ తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు 10వ రోజు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గడ్డి తిని తమ నిరసన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. 

నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు. పది రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రికి కనబడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్​ ఇప్పటికైనా తన మొండి వైఖరి వీడి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎండీఓ కార్యాలయం ముందు చెవిలో పువ్వులు పెట్టుకుని అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. 10వరోజు నిరసనలో భాగంగా చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్​ నమ్మితే అధికారంలోకి వచ్చి సీఎం అయ్యాక తమ చెవిలో జగన్ పువ్వులు పెట్టాడని అంగన్​వాడీలు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.