ETV Bharat / state

Ippatam: కూల్చడం అనేది వైకాపా ప్రభుత్వ పేటెంట్ హక్కు: తెనాలి శ్రావణ్ కుమార్

author img

By

Published : Nov 5, 2022, 8:46 PM IST

Tenali Shravan Kumar
ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్

TDP Former MLA Tenali Shravan Kumar: ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలపై తెదేపా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ స్పందించారు. జనసేన సభకు భూములిచ్చారన్న కక్షతోనే ఒక సామాజికవర్గం వారి ఇళ్లు కూల్చారని మండిపడ్డారు. దాడులు చేయటం, రాళ్లు వేయించటం రాజశేఖర్​రెడ్డి కుటుంబ పేటెంట్ హక్కని దుయ్యబట్టారు.

Tenali Shravan Kumar reacted on demolition : ఇప్పటంలో రోడ్దు విస్తరణ చేయమని ఎవరడిగారని, తెదేపా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ధ్వజమెత్తారు. జనసేన సభకు భూములిచ్చారన్న కక్షతోనే ఒక సామాజికవర్గం వారి ఇళ్లు కూల్చారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చేతనైనే రోడ్లపై గుంతలు పూడ్చాలని, కూల్చడం వైకాపా ప్రభుత్వ పేటెంట్ హక్కులా భావిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ముఖ్యమంత్రికి తెలీదా?, గుంతల్లో పడి వైకాపా కార్పొరేటర్ చనిపోయిందని అన్నారు. అక్రమ కట్టడం అని ప్రజావేదిక కూల్చిన సీఎం, మూడున్నరేళ్లలో ఎన్ని అక్రమ కట్టడాలు కూల్చారని శ్రావణ్ నిలదీశారు. దాడులు చేయటం, రాళ్లు వేయించటం రాజశేఖర్ రెడ్డి కుటుంబ పేటెంట్ హక్కని దుయ్యబట్టారు. నంద్యాల సభలో ప్రధాని పీవీ నరసింహరావుపై రాజశేఖర్ రెడ్డి రాళ్లు వేయించారని తెనాలి శ్రావణ్ ఆరోపించారు. సీఎం పదవి కోసం హైదరాబాద్ లో మత ఘర్షణలను సృష్టించారని ఆక్షేపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.