ETV Bharat / state

జోరుగా కోడి పందాలు, జూద క్రీడలు - తొలిరోజే లక్షల్లో చేతులు మారిన నగదు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 14, 2024, 7:56 PM IST

Updated : Jan 15, 2024, 6:43 AM IST

Kodi Pandelu Started in AP: కోడిపందేలను, జూదాన్ని నిర్వహించకూడదని న్యాయస్థానాలు ఆదేశించినా, అది కేవలం ఆదేశాలకే పరిమితమవుతోంది. సినిమా సెట్లను తలపించే రీతిలో ప్రత్యేకంగా పందెం బరులను ఏర్పాటు చేశారు. పందేలు నిర్వహించిన తొలిరోజే లక్షల రూపాయల నగదు చేతులు మారింది.

kodi_pandelu_started_in_ap
kodi_pandelu_started_in_ap

జోరుగా కోడి పందాలు, జూదక్రీడలు - తొలిరోజే లక్షల్లో చేతులు మారిన నగదు

Kodi Pandelu Started in AP: సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కోడిపందేలు, జూదక్రీడలు జోరుగా సాగుతున్నాయి. ఉదయం నుంచే పలుచోట్ల పందెంరాయుళ్లు పందేలను ప్రారంభించారు. కోడి పందేలు నిర్వహించకూడదని హైకోర్టు ఆజ్ఞలు ఉన్న, పందేం రాయుళ్లు వాటిని లెక్కచేయడం లేదు. అధికార పార్టీ అండదండలు మెండుగా ఉండడంతో పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో కోడిపందేలను ప్రారంభించారు. ఈ పందేలాను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పండగ తొలిరోజు నుంచే భారీగా డబ్బు చేతులు మారుతోంది. పామర్రు, మొవ్వ, పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాల్లో కోడి పందాలు, జూదాం, గుండాట శిబిరాలను ఏర్పాట్లు చేశారు.

మామిడి తోటల్లో జోరుగా పందాలు: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పల్లగిరి శివారు మామిడి తోటల్లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బరులను ఏర్పాటు చేసి మరి పందేలు నిర్వహిస్తున్నారు. రెడ్డిగూడెం మండలం రంగపురంలో పందేల బరులు ఏర్పాటు చేశారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలులో జూదం, కోడిపందాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రారంభించగా, గండేపల్లి, ఐతవరం వద్ద కోడిపందాలను ఎమ్మెల్యే జగన్మోహన్రావు ప్రారంభించారు.

కత్తులు దూసిన పందెం కోళ్లు.. చేతులు మారిన కోట్లు.. లెక్కకురాని ఆంక్షలు

పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయాలకు సమీపంలో: బాపట్ల జిల్లా నిజాంపట్నం మండల కేంద్రంలో కోడి పందేలను నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి. పందేం రాయుళ్లు పందేలు నిర్వహిస్తున్నారు. పందెం కాసేందుకు, చూసేందుకు ఇతర జిల్లాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. జూదం, గుండాట నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయాలకు సమీపంలోనే పందేలు జరుగుతుండడం కొసమేరుపు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు ఇలాకా కావడంతో అధికారులు బరుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలున్నాయి.

స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బరులు: గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు మండలం అంపాపురంలో పందెం రాయుళ్లను ఆకట్టుకునేందుకు సర్వ హంగులతో బరులను ఏర్పాటు చేశారు. మహిళలు, వీవీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వంశీ ఆధ్వర్యంలో అతని అనుచరులు ప్రధాన బరితో పాటు, మరో పది బరులు, జూదానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సినిమా తరహాలో భారీ సెట్లను ఏర్పాట్లు చేయడం విశేషం.

కోడిపందేల నిర్వహణ జీవాలపై క్రూరత్వమే- కట్టడికి కలెక్టర్లు, ఎస్పీలు కఠిన చర్యలు తీసుకోవల్సిందే: ఏపీహైకోర్టు

పందేలకు తరలివస్తున్న వారితో ట్రాఫిక్​ సమస్య : ఆదివారం ఉదయం 8 గంటలకే కోడిపందేలు, జూదం, గుండాటను ప్రారంభించారు. అంపాపురంలో నిర్వహిస్తున్న కోడి పందేలు, జూదం కోసం పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. మొదటి రోజే లక్షల రూపాయల నగదు చేతులు మారింది. పందేలను తిలకించేందుకు వస్తున్న వాహనదారులతో చెన్నై- కలకత్తా హైవేతో పాటు సర్వీసు రహదారులపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.

బరులను ఏర్పాటు చేస్తున్న సర్పంచులు : అధికార వైఎస్సార్​సీపీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పోటీలకు భారీ ఏర్పాట్లు చేశారు. వాతావరణ మార్పులతో వర్షం వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేరుగా వైఎస్సార్​సీపీ సర్పంచులే ఆయా గ్రామాల్లో వ్యక్తిగత బరులను సిద్ధం చేస్తున్నారు. అధికార పార్టీ కావడంతో పోలీసులు చూసి చూడనట్లు ఉంటున్నారు. బాపులపాడు మండలం తిప్పనగుంట, మడిచర్ల, కొత్తపల్లి, కొయ్యురు, సింగన్నగూడెం, రేమల్లె, కాకులపాడు, సీతారామపురం, గన్నవరం శివారు మర్లపాలెం, సూరంపల్లి, గోపవరపుగూడెం, కొండపావులూరు, ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి, నందమూరు, మానికొండలో పందేం బరులు కొనసాగుతున్నాయి.

కోడికత్తి గుచ్చుకుని వేరువేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి

కఠిన చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు గత నెల రోజులగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేస్తూ పలు అవగాహన సదస్సులు నిర్వహించారు. అయినప్పటికీ పందేం బరులు వెలిశాయి. ముందస్తు బైండోవర్ కేసులు నమోదు చేశారు. పందేలు నివారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు సృష్టం చేసింది. పందేలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వీక్షకులు, పందేం రాయుళ్లు తరలి వచ్చారు. తణుకు

పందేం చూడటానికి వచ్చిన వారికి కోడికూరతో భోజనం : తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో కోడిపందాలను భారీగా నిర్వహిస్తున్నారు. గతంలో నిర్వహించిన మాదిరిగానే పందేం బరులను ఏర్పాటు చేయగా, పందేలాను చూడాటానికి వచ్చిన వారికి ఈ సారి ప్రత్యేకంగా కోడికూరతో భోజనాలు ఏర్పాటు చేశారు.

kodi pandelu: సంక్రాంతి రెండో రోజూ జోరుగా సాగిన కోడిపందేలు

Last Updated :Jan 15, 2024, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.