ETV Bharat / state

CM Jagan Silence on Polavaram Project: సీఎం జగన్ మౌనముద్ర.. పోలవరం ప్రాజెక్ట్​కు వేల కోట్ల రూపాయల నష్టం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 10:10 AM IST

CM Jagan Silence on Polavaram Project: పోలవరానికి కేంద్రం అందించే సాయంలో భారీ కోతపడే పరిస్థితి తలెత్తింది. 2019లో 55 వేల 656 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణానికి సిఫార్సు చేసినా.. కేంద్ర జలసంఘం వాటిని బుట్టదాఖలు చేసింది. తాజాగా 31,625 కోట్లే ఇవ్వాలంటూ సిఫారసులు చేసింది. అసలు గత సిఫారసులు పక్కన పెట్టి కొత్తగా ఎందుకు జలసంఘం సిఫారసు చేస్తోందో తెలియని పరిస్థితి. తద్వారా వేలకోట్ల రూపాయలు నష్టపోతున్నా.. ముఖ్యమంత్రి జగన్‌ మౌనం వీడడం లేదు. విభజన చట్టం హక్కులకు కేంద్రం తూట్లు పొడుస్తున్నా నిలదీసి అడగే ధైర్యమే చేయడం లేదు.

CM_Jagan_Silence_on_Polavaram_Project
CM_Jagan_Silence_on_Polavaram_Project

CM Jagan Silence on Polavaram Project: సీఎం జగన్ మౌనముద్ర.. పోలవరం ప్రాజెక్ట్​కు వేల కోట్ల రూపాయల నష్టం

CM Jagan Silence on Polavaram Project : పోలవరం ప్రాజెక్టుకు జగన్‌ ప్రభుత్వంలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. నిధుల విషయంలో కేంద్రం షాకిస్తున్నా సీఎం జగన్‌ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా నిలదీసిన సందర్భమే లేదు. పోలవరం ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర జలసంఘం 31 వేల 625 కోట్లకు అంచనాలు ఆమోదించింది. ఆ మేరకు సిఫార్సు చేస్తూ జల్‌శక్తి మంత్రిత్వశాఖకు నివేదించింది. ఆ అంకెలను మళ్లీ పరిశీలించేందుకు కేంద్రం రివైజ్డు కాస్ట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. నవంబరు 2లోపు తన సిఫారసులు అందించాలని సూచించింది.

ఇప్పటికే ఒకసారి కేంద్ర జలసంఘం 2019లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పోలవరం అంచనాలకు ఆమోదించింది. తర్వాత 2020లో రివైజ్డు కాస్ట్‌ కమిటీ ఆ అంకెలను కొంత మార్చి సిఫార్సు చేసింది. ఆ మొత్తానికి పెట్టుబడి ఆమోదం ఇచ్చి మంత్రివర్గం ఆమోదిస్తే చాలు. అలాంటిది కేంద్రం మొత్తం ప్రక్రియను ఎందుకు మొదటికి తీసుకొచ్చింది? ప్రక్రియ తిరగతోడుతూ ఉన్నా జగన్‌ ఎందుకు మౌనముద్ర దాలుస్తున్నారు?

State Govt Constructions in Polavaram Project: ఇష్టారీతిన పోలవరం నిర్మాణ పనులు.. కేంద్రం మాట వినని జగన్​ సర్కార్​

Huge Cut in Central Aid to Polavaram : పోలవరం అంచనాలను 2013-14 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం పరిశీలించి ఆమోదించింది. తర్వాత రివైజ్డు కాస్ట్‌ కమిటీ కొంత కోత పెట్టి సిఫార్సు చేసింది. అందులో సాగు, తాగునీటి విభాగం కింద ఖర్చయ్యే 20,398 కోట్ల రూపాయలకే కేంద్ర మంత్రిమండలి ఆమోదించి ప్రస్తుతం నిధులు ఇస్తోంది. తర్వాత 2017-18 ధరల ప్రకారం నాటి రాష్ట్ర ప్రభుత్వం.. అంచనాలు సమర్పించింది. ఆ అంచనాలను కేంద్ర జలసంఘం పరిశీలించి 55 వేల 656.87 కోట్లకు ఆమోదం తెలిపింది. అందులో సాగు, తాగునీటి విభాగం కింద 51 వేల 95.96 కోట్లకు సిఫార్సు చేసింది.

2019 ఫిబ్రవరిలోనే ఈ అంచనాలు ఆమోదించింది. ఆ సిఫార్సులను పక్కన పెట్టి మళ్లీ పోలవరం ప్రాజెక్టుకు తాజా లెక్కల పేరుతో 31 వేల 625 కోట్లకే కేంద్ర జలసంఘం సిఫార్సు చేసింది. ఇందులో ప్రధాన డ్యాం, భూసేకరణ, 41.15 మీటర్ల స్థాయికి అయ్యే పునరావాసం, రెండు కాలువలకు అయ్యే ఖర్చు పేరుతోనే పరిశీలించి ఆమోదించింది. నాటి కేంద్ర జలసంఘం సిఫార్సులను పక్కన పెట్టి మళ్లీ ఎందుకు ఇప్పుడు తాజాగా సిఫార్సులు చేయించుకున్నారు? ఇంత కోత పెట్టినా జగన్‌ ఎందుకు మాట్లాడరన్న ప్రశ్న వినిపిస్తోంది.

Central Government on Polavaram Project రంగంలోకి దిగనున్న కేంద్రం.. పోలవరం ప్రాజెక్టుపై లోతుగా దర్యాప్తు

Center Approved For Revised Cost Estimation of Polavaram Project : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలంటే 2010-11 నుంచి ఒకటే ప్రక్రియ సాగుతోంది. తొలుత కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదించడం, తర్వాత పెట్టుబడి ఆమోదం కేంద్ర మంత్రి మండలి ఆమోదించడం ఉంటాయి. కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన మొత్తానికే చేసిన పనిని బట్టి నిధులు రీయింబర్సు చేస్తున్నారు.

2019 ఫిబ్రవరిలో కేంద్రజలసంఘం 55 వేల 656.87 కోట్లకు ఆమోదించింది. రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ 2020 మార్చిలో 47వేల725.74 కోట్లకు ఆమోదించింది. కేంద్ర జలసంఘమూ పరిశీలించింది, సాంకేతిక సలహా కమిటీ ఆ మొత్తాన్ని సిఫార్సు చేసింది. తర్వాత రివైజ్డు కాస్ట్‌ కమిటీ కూడా పరిశీలించి నిధులు సిఫార్సు చేసింది. ఇంత ప్రక్రియ జరిగిన తర్వాత కేంద్ర మంత్రిమండలి ఆ మొత్తానికి ఆమోదం తెలిపి నిధులిస్తే సరిపోయేది. అలాంటిది మళ్లీ ప్రక్రియను మొదటికి తీసుకొచ్చారు.

Thousands of Crores of Rupees Loss to Polavaram Project : కేంద్ర జలసంఘం తాజా సిఫార్సుల్లో మునుపటి మొత్తాలతో పోలిస్తే అంత స్థాయిలో ఎందుకు కోత పెట్టినట్లు? రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్‌ ఎందుకు మౌనముద్ర దాలుస్తున్నట్లు? 47 వేల 725.74 కోట్లకు ఆమోదించాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోపోతున్నా నిలదీయలేని స్థితిలో సీఎం జగన్‌ ఉన్నారు. కేంద్ర సర్క్యులర్‌లో ఎక్కడా తొలిదశ నిధులన్న ప్రస్తావన లేదు. 2017-18 ధరలు ఆమోదించుకునేందుకు ఇప్పటికే అయిదేళ్లు గడిచిపోయింది. రెండు కమిటీలు ఆమోదించినా కేంద్రం వాటిని పట్టించుకోకుండా ప్రక్రియను మొదటికి తీసుకొచ్చింది.

అలాంటిది 41.15 మీటర్ల స్థాయి నుంచి 45.72 మీటర్ల స్థాయికి అవసరమయ్యే భూసేకరణ, పునరావాసం నిధులు తెచ్చుకోవాలంటే ఎన్ని ఏళ్లు పడుతుంది? మళ్లీ కేంద్ర జలసంఘం, రివైజ్డు కాస్ట్‌ కమిటీ ఎప్పటికి సిఫార్సులు చేస్తాయి? రెండో దశ పునరావాసానికి వేల కోట్లు మళ్లీ ఎప్పటికి తెచ్చుకోగలుగుతాం? రాష్ట్ర విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. పూర్తినిధులు కేంద్రమే భరిస్తామని చెప్పింది. ఆ విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్నా జగన్‌ కేంద్రంతో ఎందుకు పోరాడటం లేదో సమాధానం చెప్పాలి.

Polavaram Guide Bund Collapse Reason: పోలవరం గైడ్‌బండ్‌పై కేంద్ర నిజనిర్ధారణ కమిటీ నివేదిక.. నిర్మాణ నాణ్యత సరిగా లేకనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.