ETV Bharat / state

Traffic Problems at Railway Level Crossings: ఆర్వోబీలకు నిధులివ్వని జగన్ సర్కార్‌.. రైల్వే వంతెనలు పూర్తికాక ప్రజలు అవస్థలు..

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2023, 10:21 AM IST

Updated : Oct 21, 2023, 12:30 PM IST

Traffic Problems at Railway Level Crossings: సీఎం జగన్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా.. హెలికాప్టర్​లో వెళ్తారు. రోడ్డుమార్గంలో ప్రయాణం అంటే.. ఎక్కడా ఒక్క క్షణం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. అదే సామాన్యులు.. రైల్వేలైన్ ఉన్న మార్గంలో వెళ్లాల్సి వస్తే గేట్ పడితే చాలు.. వేచి చూడాల్సిన దుస్థితి. ఇలాంటి రైల్వే క్రాసింగ్‌ల వద్ద వంతెనలను నిర్మిస్తామంటూ చాలాకాలంగా రైల్వేశాఖ వెంటపడుతున్నా.. రాష్ట్ర వాటా జగన్‌ సర్కార్‌ ఇవ్వడం లేదు. ఉలుకూపలుకూ లేకుండా చోద్యం చూస్తోంది. నాలుగున్నరేళ్లలో ఒక్క ఆర్వోబీ కూడా పూర్తి కాలేదంటే వైసీపీ ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకోవచ్చు.

Traffic_Problems_at_Railway_Level_Crossings
Traffic_Problems_at_Railway_Level_Crossings

Traffic Problems at Railway Level Crossings: ఆర్వోబీలకు నిధులివ్వని జగన్ సర్కార్‌.. రైల్వే వంతెనలు పూర్తికాక ప్రజలు అవస్థలు..

Traffic Problems at Railway Level Crossings: రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెన నిర్మించాలంటే రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం నిధులు భరిస్తాయి. రైల్వేలైన్ పైన వంతెన భాగాన్ని రైల్వే శాఖే నిర్మిస్తుంది. దానికి రెండువైపులా అప్రోచ్లను ఆ రోడ్డును బట్టి ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, పురపాలకశాఖలు నిర్మిస్తుంటాయి. రాష్ట్రంలో దాదాపు 90 వరకు ఆర్వోబీలను నిర్మించాల్సి ఉందని.. రైల్వేశాఖ గుర్తించింది. వీటిలో 48 వంతెనల నిర్మాణానికి మూడు దఫాలుగా రాష్ట్రానికి ప్రతిపాదనలు పంపించింది. వాటా నిధులిచ్చేందుకు జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటంతో చాలావరకు పనులు మొదలుకాలేదు. కొన్నిచోట్ల రైల్వేభాగం వరకే వంతెనలను నిర్మించి వదిలేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో గూడూరులోని రైల్వేలైన్ వంతెన పూర్తి చేసి వాహనదారుల కష్టాలు తీరుస్తామని 2018 డిసెంబరు 20న గూడూరులో నిర్వహించిన పాదయాత్ర సభలో ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. ఆయన సీఎం అయి ఇప్పటికి 53 నెలలు గడిచాయి. ఇప్పటికీ గూడూరు రైల్వే వంతెన ఒక్కడుగు కూడా ముందుకు కదల్లేదు. నిత్యం 130 వరకు వివిధ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సీఎం జగన్ తన హామీని గాలికొదిలేయడంతో రైల్వేగేటు పడినప్పుడుల్లా అరగంటకు పైగానే నిరీక్షించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలు సమీపిస్తున్న తరుణంలో ఆర్వోబీ పనులను పూర్తి చేసేస్తామంటూ ఎమ్మెల్యే వరప్రసాదరావు గత ఆరు నెలల్లో రెండుసార్లు శంకుస్థాపనలు చేశారు. నేటికీ పనులు అతీగతీ లేదు.

శంకుస్థాపనకే పరిమితమైన ఆర్వోబీ... నరకం చూస్తున్న ప్రజలు

ఇది.. సీఎం జగన్‌ సొంత జిల్లాలోని కమలాపురం రైల్వేగేటు వద్ద పరిస్థితి. ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువ. గేట్ పడిన ప్రతిసారీ కనీసం 15 నిమిషాలు వాహనదారులు నిరీక్షించక తప్పడం లేదు. ఇక్కడి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్వయాన జగన్ మేనమామ. ప్రతిసారీ ఎన్నికలకు ముందు ఆర్వోబీ నిర్మాణంపై ఆయన హామీ ఇస్తూనే ఉన్నారు. రెండేళ్ల కిందట కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల సమయంలో.. ఈ ఆర్వోబీ పూర్తి చేశాకే.. సాధారణ ఎన్నికల్లో మీ ముందుకొస్తానంటూ హామీ ఇచ్చారు. నేటికీ నెరవేర్చలేదు. తన వాటా సొమ్ము ఇవ్వలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేయడంతో దానిని నిర్మించేందుకు కేంద్రమే ముందుకొచ్చింది. గతేడాది డిసెంబరు 23న సీఎం జగన్ శంకుస్థాపన చేసినా.. ఇప్పటికీ పనులు మొదలుకాలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్వోబీల నిర్మాణానికి అవసరమైన రాష్ట్ర వాటా ఇచ్చే పరిస్థితి లేదని వైసీపీ ప్రభుత్వం పదేపదే కేంద్రం వద్ద మొరపెట్టుకుంది. రాష్ట్ర రహదారులపై ఆర్వోబీలను పూర్తిగా కేంద్ర నిధులతోనే నిర్మించాలని గతేడాది ఫిబ్రవరిలో విజయవాడలో నిర్వహించిన సభలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. దీంతో సేతుబంధన్ పథకం కింద 38 ఆర్వోబీల నిర్మాణానికి కేంద్రం ముందుకొచ్చింది. తొలివిడత 10 చోట్ల నిర్మించేందుకు అంగీకరించింది.

Bridge Collapse: నిర్వహణ లోపం.. కుప్పకూలే దుస్థితికి చేరుకున్న పురాతన వంతెనలు..

సేతుబంధన్ కింద నిర్మించే ఆర్వోబీలకు అవసరమయ్యే భూసేకరణ, అక్కడి విద్యుత్తు స్తంభాలు, కాల్వలను పక్కకు మార్చేందుకయ్యే వ్యయాన్ని రాష్ట్రమే వెచ్చించాలని కేంద్రం నిబంధన విధించింది. 38 ఆర్వోబీలకు కలిపి 2 వేల 661 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనావేయగా, ఇందులో భూసేకరణ, విద్యుత్తు స్తంభాలను పక్కకు మార్చడానికయ్యే 521 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. వీటికి కూడా నిధులివ్వకపోవడంతో వంతెనల నిర్మాణం సాధ్యపడటం లేదు.

చెన్నై-కోల్‌కతా, విజయవాడ- హైదరాబాద్ రైల్వే లైన్లలో 20 వరకు ఆర్వోబీల నిర్మాణానికి గతంలో రైల్వేశాఖ ప్రతిపాదించింది. 2020-21లో మరో 9, గతేడాది ఇంకో 20 వంతెనలను ప్రతిపాదించింది. వీటికి తన వాటా ఇవ్వాల్సిన రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవటంతో సొంత నిధులు ఖర్చు చేసేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. భూసేకరణ, విద్యుత్ స్తంభాలను పక్కకు మార్చడం తదితరాలకు సహకరించాలని కోరుతూ ఇటీవలే రాష్ట్రప్రభుత్వానికి లేఖ పంపింది. మరోవైపు రాష్ర్టం తన వాటా నిధులు కేటాయించి రైల్వే వంతెల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

కర్నూలు ప్రజలకు కష్టంగా.. అసంపూర్తి వంతెనలు

Last Updated : Oct 21, 2023, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.