ETV Bharat / state

raid: అధికారులు ఆకస్మిక దాడులు... పెద్దఎత్తున నాటుసారా, బెల్లం ఊట స్వాధీనం

author img

By

Published : Oct 6, 2021, 11:59 AM IST

SEB officials raid
SEB officials raid

తూర్పుగోదావరి జిల్లాలో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. పలు మండలాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో పెద్ద ఎత్తున్న నాటు సారా, బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో 15 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి.. పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ తారకరామ కాలనీలో ఎస్ఈబీ అధికారులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీఎస్‌పీ ఆధ్వర్యంలో 50 మంది ఎస్‌ఈబీ, సివిల్ పోలీసులు ఊరంతా సోదాలు చేశారు. పెద్దఎత్తున నాటుసారా, బెల్లం ఊట, నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. సారా నిల్వకు ఉపయోగించే 50 డ్రమ్ములు, 12 వంట గ్యాస్ సిలిండర్లతోపాటు ఎలాంటి పత్రాల్లేని 15 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు. ఆరుగురిని అరెస్టు చేశామని చెప్పారు. సారా, మాదక ద్రవ్యాలు అమ్మినా, తయారుచేసినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

మరోవైపు పత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లోనూ ఎస్ఈబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. సిరిపురం,పెద్ద శంకర్లపూడి గ్రామాల్లో దాడులు నిర్వహించి.. 1000లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 20లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: విశాఖలో గంజాయి పట్టివేత... ఒడిశా కానిస్టేబుల్ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.