ETV Bharat / state

Rains in AP: రాష్ట్రంలో భారీ వర్షాలు..పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Jun 2, 2021, 4:53 PM IST

Updated : Jun 2, 2021, 7:26 PM IST

rain
rain

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది.

నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

రాష్ట్రంలో భారీ వర్షాలు

తూర్పు గోదావరి జిల్లాలో..

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో నేడు భారీగా వర్షం కురిసింది. ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది.

విజయనగరం జిల్లా....

విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. జరడ గ్రామంలో పిడుగుపాటుకు 5ఎద్దులు మృతి చెందాయి.

శ్రీకాకుళం జిల్లా...

శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, వీరఘట్టం, రాజాం,పలాసలో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటన్నరపాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

కృష్ణాజిల్లాలో...

కృష్ణా జిల్లాలోని గన్నవరం, ఉయ్యూరు, పెనమలూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షానికి విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గన్నవరం మండలం ముస్తాబాద్‌లో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు.

పశ్చిమ గోదావరి జిల్లా...

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల చెట్లు నేలకూలి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎండ వేడిమి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు.

విశాఖ జిల్లా....

విశాఖ జిల్లా అరకు లోయలో భారీ వర్షాలు కురిశాయి. మేదేరసొల గ్రామంలో పిడుగుపాటుకు భీమన్న అనే వ్యక్తి మృతి చెందాడు.

ఇదీ చదవండి

పలకరించనున్న నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు

Last Updated :Jun 2, 2021, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.