ETV Bharat / state

చోరీ కేసులో మహిళను హింసించిన పోలీసులను అరెస్ట్ చేయాలి: లోకేశ్‌

author img

By

Published : Jan 23, 2022, 9:55 PM IST

nara lokesh
nara lokesh

nara lokesh on Chittoor sub-jail superintendent house theft case : చిత్తూరు జైలు సూపరిండెంట్ ఇంట్లో జరిగిన చోరీ కేసులో పోలీసులు తీరుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పని మనిషి ఉమామహేశ్వరిపై అన్యాయంగా చోరీ కేసు పెట్టారని ఆరోపించారు. దళిత మహిళను హింసించిన పోలీసుల్ని త‌క్షణ‌మే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

nara lokesh on Chittoor sub-jail superintendent house theft case : సీఎం జగన్ పాలనలో దళితులు, మహిళలకు రక్షణ లేదన్నారు నారా లోకేశ్. ఇదే విషయం చిత్తూరు జైలు సూపరిండెంట్ ఇంట్లో చోరీ కేసులో మరోసారి స్పష్టమైందని చెప్పారు. ఈ కేసు విచారణలో పోలీసులు తీరు దారణమన్నారు. పని మనిషి ఉమామహేశ్వరిపై అన్యాయంగా చోరీ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను నిర్బంధించ‌డంతో పాటు స్టేష‌న్‌లోనే చితకబాదారన్నారు. దళిత మహిళను హింసించిన పోలీసుల్ని త‌క్షణ‌మే అరెస్టు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ, మ‌హిళ క‌మిష‌న్లు సుమోటోగా కేసు న‌మోదు చేయాలని కోరారు.

అసలు ఏం జరిగిందంటే..?

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. విచారణ పేరుతో ఎస్సీ మహిళ పై పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. నగరంలోని లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో ఏడాది కాలంగా పని చేస్తోంది. వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో రూ. రెండు లక్షల నగదు కనిపించక పోవడంతో పని మనిషి ఉమా మహేశ్వరిని ప్రశ్నించారు. నగదు కనిపించక పోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఉమా మహేశ్వరి చెప్పినా వినకుండా పోలీసులను పిలిపించారు.ఈ నెల 18 వ తేదీ చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్​కు తనను పిలిపించి చేతి వేలి ముద్రలు తీసుకుని పోలీసులు పంపించేసినట్లు ఉమా మహేశ్వరి మీడియాకు తెలిపారు.

అనంతరం 19 వ తేదీ తనను మళ్లీ పోలీసు స్టేషన్ కు పిలిచి కాళ్ళు చేతులు కట్టేసి లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించారు. స్పృహ కోల్పోయే వరకు తనను పోలీసులు కొట్టారని ఆమె తెలిపారు. అనంతరం ఎస్సై వచ్చిన తరువాత తనను పోలీసులు విడిచి పెట్టారని చెప్పారు. తీవ్ర గాయాలపాలైన ఉమా మహేశ్వరి అస్వస్థతకు గురికావడంతో ఆమె భర్త, తల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె వెల్లడించారు. తనను పలుమార్లు కులం పేరుతో పోలీసులు దూషించారని ఆమె ఆరోపించారు. అనంతరం దొంగతనం సంఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో తెలియడంతో పోలీసులు తనను బుజ్జగించినట్లు చెప్పారు. తనకు తగిలిన గాయాలకు చికిత్స చేయించి పరిహారం ఇస్తామని పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయం బయట ఎవరికీ చెప్పకూడదని బెదిరించినట్లు ఉమా మహేశ్వరి పేర్కొన్నారు. అకారణంగా తనను దొంగతనం పేరుతో చిత్రహింసలు చేసిన పోలీసులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.

ఇదీ చదవండి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

జైలు సూపరింటెండెంట్‌ ఇంట్లో చోరీ కేసు.. కానిస్టేబుల్​పై వేటు

లాఠీ కాఠిన్యం... విచారణ పేరుతో ఎస్సీ మహిళపై చిత్రహింసలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.