ETV Bharat / state

నారాయణ బెయిల్​ రద్దు చేయండి.. పోలీసుల రివిజన్ పిటిషన్

author img

By

Published : May 13, 2022, 1:50 PM IST

Updated : May 13, 2022, 5:42 PM IST

Narayana Bail Issue
నారాయణకు మంజూరు చేసిన బెయిల్​ను రద్దు చేయాలని రివిజన్ పిటిషన్​ దాఖలు

Narayana Bail Issue: మాజీ మంత్రి నారాయణకు మంజూరు చేసిన బెయిల్​ను రద్దు చేయాలని చిత్తూరు జిల్లా న్యాయస్థానంలో పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరఫున రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్​రెడ్డి పిటిషన్ వేశారు.

నారాయణ బెయిల్​ రద్దు చేయండి.. పోలీసుల రివిజన్ పిటిషన్

Narayana Bail Issue: మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్​ను రద్దు చేయాలని పోలీసుల తరఫున రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్​రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చిత్తూరులోని జిల్లా న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. నారాయణకు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిలు చట్ట విరుద్ధమని సుధాకర్​రెడ్డి అన్నారు. నారాయణకు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్​ ఉత్తర్వుల రద్దుకు జిల్లా సెషన్స్ న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు.

చట్టం దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొన్నారు. ఈ కేసులో 435, 437, సెక్షన్ 18 పీఆర్సీ కింద సొంత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిలు ఇవ్వడం న్యాయబద్దంగా లేదన్నారు. కనీసం రిమాండ్ సైతం చేయలేదని చెప్పారు. కుట్ర పన్నడానికి ఛైర్మన్​ పదవి అవసరం లేదన్నారు. ఈ కేసులో ముద్దాయిలు ఇచ్చిన పత్రంలో నారాయణ పాత్ర చాలా స్పష్టంగా ఉందని అన్నారు. పిటిషన్​పై వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Last Updated :May 13, 2022, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.