చిలకలూరిపేటలో ఉద్రిక్తత.. ప్రత్తిపాటి కారును అడ్డుకున్న పోలీసులు
Updated on: May 13, 2022, 2:23 PM IST

చిలకలూరిపేటలో ఉద్రిక్తత.. ప్రత్తిపాటి కారును అడ్డుకున్న పోలీసులు
Updated on: May 13, 2022, 2:23 PM IST
NTR SUJALA ISSUE: చిలకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల పథకం పునఃప్రారంభోత్సవంలో వివాదం చెలరేగింది. తాగునీటి పథకం ప్రారంభానికి వచ్చిన ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
NTR SUJALA ISSUE: ఎన్టీఆర్ సుజల పథకం పునః ప్రారంభం చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేటతో పాటు మరికొన్ని గ్రామాల్లో బోర్లు వేశారు. నీటి ట్యాంకులు నిర్మించి ట్రయల్ రన్ కూడా పూర్తిచేశారు. అమలు దశ వచ్చేసరికి ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత పథకాన్ని ఆపివేశారు. దీనివల్ల మూడేళ్లుగా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ పనులు పూర్తి చేయించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.... చిలకలూరిపేట చెరువు వద్ద ఉన్న ఎన్టీఆర్ సుజల ట్యాంకు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
అయితే దీనిపై మున్సిపల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాగునీటి పథకం బోర్లకు అనుమతి లేదని నోటీసులు ఇచ్చారు. ప్రజలు తాగునీటి ఇబ్బందుల దృష్ట్యా పథకం ప్రారంభానికి వచ్చిన పుల్లారావును... అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కారు దిగనీయకుండా ఆయన్ను నిలువరించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం కార్యకర్తలు... పుల్లారావును అడ్డుకోవడం సరికాదంటూ ఆందోళన చేపట్టారు. కార్యకర్తల సాయంతో కారు దిగిన ప్రత్తిపాటి... కొబ్బరికాయ కొట్టి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో కొందరు కార్యకర్తల ఫోన్లను పోలీసులు లాక్కోవటంతో మళ్లీ వివాదం చెలరేగింది. ఫోన్లు ఇచ్చేయాలంటూ శ్రేణులతో కలిసి ప్రత్తిపాటి ఆందోళనకు దిగారు.
ఇవీ చదవండి: Marriages at Nuvvalarevu: రెండేళ్లకోసారి పెళ్లిళ్లు.. ఊరంతా పండగే
