ETV Bharat / state

వంతెన నిర్మించరు... సమస్యలు పరిష్కరించరు..!

author img

By

Published : Dec 3, 2019, 4:13 PM IST

Updated : Dec 3, 2019, 8:48 PM IST

handriniva canal problems in chittor
మా కష్టాలు పట్టవా....

ప్రజాక్షేమం కోరుతూ... ప్రభుత్వం ఎన్నో పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. కానీ అవి ఫలితాన్ని ఇవ్వడంలేదు. ప్రజల బాధలు తీరడం లేదు. ఒక ఊరు నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే... ప్రాణాలు పనంగా పెట్టాల్సిన దుస్థితి నెలకొంది చిత్తూరు జిల్లాలో పలుచోట్ల.

వంతెన నిర్మించరు... ఊరు దాటనీయరు..!

చిత్తూరు జిల్లా వాసులకు హంద్రీనీవా వరప్రదాయని. కృష్ణా జలాలతో ప్రవహిస్తూ... ప్రజలకు తాగు, సాగు నీటి అవసరాలను తీరుస్తుంది. కొన్నేళ్లుగా హంద్రీనీవాపై కాలువ నిర్మాణ పనులు కొనసాగుతున్నా... ఇరువైపుల ఉన్న గ్రామాల ప్రజల కష్టాలను అధికారులు పట్టించుకోవడం లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని పెద్దతిప్ప సముద్రం, బి.కొత్తకోట, కురబలకోట, మదనపల్లి మండలాల మీదుగా కుప్పం వరకు అన్ని రకాల పనులను గుత్తేదారులకు అప్పగించారు.

కాలువపై అక్కడక్కడ వంతెనలు నిర్మించాలన్న ఆలోచన మాత్రం చేయలేదు. కాలువలకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర కష్టాలు పడుతున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల్లో 18 ఆవాస ప్రాంతాల్లో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల నిర్మించి... అసంపూర్తిగా ఉన్న కాలువ గేట్లపై తాత్కాలికంగా వంతెనలు ఏర్పాటు చేసుకొని ప్రమాదపు అంచుల్లో ప్రయాణం సాగిస్తున్నారు.

పెద్దతిప్ప సముద్రం మండలం గుడ్డంవారిపల్లి వద్ద మట్టి, కర్రలతో వంతెన ఏర్పాటు చేసుకొని ప్రయాణిస్తున్నారు. విధిలేక, ప్రమాదకరమని తెలిసినా ఆ వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా మృతిచెందితే మృతదేహాన్ని కాలువకు అటువైపు ఉన్న శ్మశానానికి తీసుకెళ్లలేని దుస్థితి. గుడ్డంవారిపల్లెను ఆదర్శంగా తీసుకున్న ఇతర ప్రాంతాల ప్రజలు... ఇలాంటి వంతెనలే నిర్మించుకుంటున్నారు. తమకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండీ..శ్రీవారి ఆలయ రాజగోపురానికి నాచు... భక్తుల ఆగ్రహం

Intro:


Body:Ap-tpt-76-03-vanthena kastalu-Avb-Ap10102


చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని పెద్దతిప్ప సముద్రం, బి.కొత్తకోట కురబలకోట మదనపల్లి మండలాల మీదుగా కుప్పం వరకు హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కాలువ నిర్మాణ పనులు కొనసాగిన కాలువకు ఇరువైపుల ఉన్న గ్రామాల ప్రజల కష్టాలను అధికారులు గుర్తించలేకపోయారు. అన్ని రకాల పనులను వివిధ గుత్తేదారులకు అప్పగించి చేతులు దులిపేసుకుంది. అధికారులు కాలువపై అక్కడ అక్కడ వంతెనలు నిర్మించాలన్న ఆలోచన లేకపోయింది. ఫలితంగా కాలువలకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు ఇటు వైపు నుంచి అటు వైపు అటువైపు నుంచి ఇటు వైపు రాకపోకలు సాగించడానికి తీవ్ర కష్టాలు పడుతున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో 18 ఆవాస ప్రాంతాల్లో వంతెన కష్టాలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల అధికారులు నిర్మించిన అసంపూర్తిగా ఉన్న కాలువ గేట్ల పై తాత్కాలికంగా కర్రలు మట్టితో వంతెనలు నిర్మించుకొని ప్రమాదభరితమైన రాకపోకలు కొనసాగిస్తున్నారు. పెద్దతిప్ప సముద్రం మండలం గుడ్డంవారిపల్లి వద్ద ఇలాంటి వంతెన ఏర్పాటు చేసుకుని ప్రమాదకరమైన తెలిసినా విధిలేని పరిస్థితిలో వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే మృతదేహాన్ని కాలువకు అటువైపు ఉన్న స్మశానానికి తీసుకు రావాలంటే కష్టాలు తప్పవని విధిలేని పరిస్థితిలో కష్టాలు పడి కాలువ దాటించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామన్నారు. గుడ్డంవారిపల్లె ను ఆదర్శంగా తీసుకున్న ఇతర ప్రాంతాల ప్రజలు ఇలాంటి వంతెనలు ప్రత్యామ్నాయంగా నిర్మించుకుంటున్నారు.
హంద్రీనీవా కాలువల నిర్వహణ అధికారులు వంతెన లేక కష్టాలు పడుతున్న ప్రాంతాల్లో తాత్కాలిక ఇనుము లేదా ప్లాస్టిక్ తో పటిష్టమైన వంతెనలు నిర్మించాల్సి ఉంది. శాశ్వత పరిష్కారంగా పటిష్టంగా సిమెంటు వంతెనలు నిర్మాణాలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


Av-utthanna-guddamvaripalle
Av-Ramamoorthy-Raithu
Av-Lakshmamma-vruddhuralu
Av-Venkatamma


R.sivaReddy kit no 863 tbpl ctr
8008574616


Conclusion:
Last Updated :Dec 3, 2019, 8:48 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.