ETV Bharat / state

సంక్రాంతి సంబరాలు.. పంచె కట్టుతో మెరిసిన పోలీసులు

author img

By

Published : Jan 13, 2023, 12:38 PM IST

Updated : Jan 13, 2023, 2:14 PM IST

సంక్రాంతి అంటే ఇంటి ముందు అందమైన రంగవల్లులు, పిండివంటలు, చిన్నపిల్లల సందడి ఇవి మాత్రమే కాదు. పండుగ అంటే సంప్రదాయ దుస్తులు. పండుగ నాడు మహిళలు పట్టుచీరల్లో మెరిస్తే.. మగవారు పంచెలతో అదరగొడతారు. ఇది కామన్​.. అయితే ఎప్పుడూ ఖాకీ దుస్తుల్లో ఉండే పోలీసులు పంచెలు కడితే అది కదా అసలు పండగంటే. బాపట్ల జిల్లా పోలీసులు కూడా పట్టుబట్టలు కట్టుకుని ముందస్తు సంబరాలు చేసుకున్నారు.

bapatla police Sankranti celebrations
bapatla police Sankranti celebrations

వారు ఖాకీ వేసిన.. లాఠీ పట్టిన దొంగలకు దడ. నిత్యం ఖాకీ బట్టలతో తీరిక సమయం లేకుండా గడిపే పోలీసులకు పండుగ నాడు కూడా పనే ఉంటుంది. వారికీ తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకుని ఆనందంగా ఉండాలని అనుకుంటారు. కానీ అందుకు వారికి సమయం దొరకకా అటువంటి ఆనందాలను మిస్​ అవుతున్నారు. అయితే బాపట్ల జిల్లాలో ఖాకీలు మాత్రం సంక్రాంతి ముందస్తూ సంబరాలు జరుపుకుని వారి కుటుంబాలతో ఆనందంగా ఎంజాయ్​ చేశారు.

చాలా వరకు సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ. అయితే ఎక్కువ శాతం మంది ఆ మూడు రోజులే పండుగ జరుపుకుంటారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా ముందస్తు వేడుకలు ఎక్కువ అవుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు సైతం పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలలు, కార్యాలయాలు, ఇలా ఎక్కడ చూసిన ముందస్తు సంబరాలు జోరుగా సాగుతున్నాయి. మరి ఇంతమంది ముందుగానే సంబరాలు జరుపుకుంటుంటే మేము మాత్రం ఏం తక్కువ అంటూ పోలీసులు కూడా కదం తొక్కారు.

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి.. చిన్నా, పెద్దా అందరూ కలిసి మూడు రోజులు జరుపుకునే సంబరం. సంక్రాంతి సంబరాలతో పల్లెల్లోనే కాదు పట్టణాలు సైతం పండుగ శోభను సంతరించుకుంటాయి. ఎప్పుడూ కఠినంగా తమ విధులు నిర్వహించే ఖాకీలు సంప్రదాయ దుస్తులు ధరించి ముందస్తు సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు. బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

జిల్లా కలెక్టర్ కె.విజయ కృష్ణన్ పొంగలి పొంగిస్తూ గరిట తిప్పగా.. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సంప్రదాయ పంచె కట్టుతో సందడి చేశారు. పోలీసు సిబ్బంది హోదాలు మరిచి అందరూ ఒకటిగా పోలీస్ పెరేడ్ మైదానంలో సంబరాలు చేసుకున్నారు. అధికారులు, పోలీస్ సిబ్బంది వారి కుటుంబాలతో మ్యూజికల్ చైర్, ముగ్గుల పోటీ, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు.

భోగి మంటలు వేసి సందడి చేశారు. విజేతలకు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్ బహుమతులు అందచేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ, కలెక్టర్​లు మాట్లాడుతూ... కొత్త జిల్లా ఏర్పడిన తరువాత మొదటి సారి సంక్రాంతి సంబరాలు పోలీస్ కుటుంబ సభ్యులతో జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు.

సంక్రాంతి సంబరాలు.. పంచె కట్టుతో మెరిసిన పోలీసులు

ఇవీ చదవండి:

Last Updated :Jan 13, 2023, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.