ETV Bharat / state

పద్మశ్రీ పురస్కారం హస్తకళా రంగానికి ఇచ్చిన అరుదైన గౌరవం: సీవీ రాజు

author img

By

Published : Jan 27, 2023, 10:08 AM IST

Etv Bharat
Etv Bharat

Padma Sri CV Raju: ఉత్తరాంధ్రలో పద్మశ్రీ పొందిన తొలి వ్యక్తిగా లక్కబొమ్మల తయారీలో ప్రఖ్యాత కళాకారుడు వెంకటపతిరాజు ఖ్యాతికెక్కారు. పద్మశ్రీ పురస్కారం 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏటికొప్పాక హస్తకళా రంగానికి ఇచ్చిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు వెంకటపతి రాజు తెలిపారు. .

Padma Sri CV Raju: ఏటికొప్పాక హస్త కళకి 500 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉందని అప్పటినుంచి ఎంతోమంది కళాకారులు ఈ ప్రాంతానికి గుర్తింపు తెచ్చారని దీని గుర్తించి కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ ఇవ్వడం కళారంగానికి ఇచ్చిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు సీవీ రాజు తెలిపారు. ఉత్తరాంధ్రలోనే పద్మశ్రీ పొందిన తొలి వ్యక్తిగా వెంకటపతిరాజు ఖ్యాతి పొందారు. కళాకారుడు చేసే వృత్తి పట్ల గౌరవం ఉండాలని అప్పుడే వృత్తి నిలబడి ముందు తరాల వాళ్ళు దీంట్లోకి రావడానికి ఆసక్తి చూపుతారని అన్నారు. పోటీ ప్రపంచంలో ఏటికొప్పాక బొమ్మలు రాణించాలంటే నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రభుత్వ పరంగా అందిస్తున్న ప్రోత్సాహం బాగానే ఉందని వెల్లడించారు.

"ఏటికొప్పాక తాలూకు విశిష్టత ఏటికొప్పాకదే. అలాగే కొండపల్లి తాలూకు విశిష్టత కొండపల్లిదే. చైనా బొమ్మలు వచ్చాయి మా మార్కెట్ పోయిందని అంటున్నారు కానీ నాణ్యత ప్రమాణాల పాటిస్తే వీటిని డామినేట్ చేయలేవు. ఈ విషయాన్ని కళాకారులు గుర్తించాలి. అది కూడా ప్రభుత్వమే చేయాలంటే కొంత వరకే చేస్తుంది. డిసైనర్, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపడతారు. గ్రైండ్ లో చేయవలసిన పని కళాకారులే చేయాలి. ఏటికొప్పాకలో నేను ఉండవచ్చు మరోకరు ఉండవచ్చు కానీ కళ మాత్రం నాకంటే ముందే ఉన్నది. కాబట్టి ఈ గుర్తింపు, మన్నన, మర్యాద కళకే వచ్చాయి." -సీవీ రాజు

పద్మశ్రీ పురస్కారం హస్తకళా రంగానికి ఇచ్చిన అరుదైన గౌరవం: సీవీ రాజు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.