ETV Bharat / sports

Tokyo Paralympics: డిస్కస్​ త్రోలో యోగేశ్​కు రజతం

author img

By

Published : Aug 30, 2021, 8:28 AM IST

Updated : Aug 30, 2021, 9:03 AM IST

Yogesh Kathuniya wins silver medal in discus throw F56 at Tokyo Paralympics
Tokyo Paralympics: డిస్కస్​ త్రోలో యోగేశ్​కు రజతం

08:25 August 30

ఐదుకు చేరుకున్న పతకాల సంఖ్య

టోక్యో పారాలింపిక్స్​ డిస్కస్​ త్రోలో భారత క్రీడాకారుడు యోగేశ్​ కథునియా మెరిశాడు. సోమవారం జరిగిన పురుషుల ఎఫ్​56 ఫైనల్​ ఈవెంట్​లో రెండో స్థానంలో నిలిచి.. రజతం గెలుచుకున్నాడు.  

ఆరో ప్రయత్నంలో అత్యధికంగా 44.38 మీ. దూరం డిస్కస్​ త్రోను విసిరి.. రెండో స్థానంలో నిలిచి సిల్వర్​ మెడల్​ను సొంతం చేసుకున్నాడు. దీంతో టోక్యో పారాలింపిక్స్​లో భారత్​ సాధించిన పతకాల సంఖ్య ఐదుకు చేరుకుంది. అంతకుముందు ఆదివారం హైజంప్​లో రజత పతకం తర్వాత ఇది రెండోది. ఈ సందర్భంగా యోగేశ్​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 

"యోగేశ్​ కథునియా నుంచి అత్యుత్తమ ప్రదర్శన. దేశం కోసం రజత పతకం సాధించినందుకు సంతోషం. అతడి విజయం వర్థమాన అథ్లెట్లను ప్రోత్సహిస్తుంది. యోగేశ్​కు అభినందనలు. అతడి భవిష్యత్​లోనూ అనేక విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని మోదీ ట్వీట్​ చేశారు. 

Last Updated : Aug 30, 2021, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.