ETV Bharat / sports

దుమ్మురేపిన మహిళల హాకీ జట్టు.. క్వార్టర్స్​లో విజయం

author img

By

Published : Aug 2, 2021, 10:02 AM IST

Updated : Aug 2, 2021, 1:08 PM IST

hockey
దుమ్మురేపిన మహిళల హాకీ జట్టు.. క్వార్టర్స్​లో విజయం

09:53 August 02

సెమీస్​లో అర్జెంటీనాతో తలపడనున్న రాణి రాంపాల్​ సేన

Tokyo Olympics: India women's hockey team beat Australia
టోక్యో ఒలింపిక్స్​ పతకాల పట్టిక

టోక్యో ఒలింపిక్స్​లో సోమవారం జరిగిన హాకీ క్వార్టర్స్​లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ప్రపంచ నంబరు.2 జట్టు అయిన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో 1-0 తేడాతో గెలుపొంది.. సెమీఫైనల్​కు చేరింది. 22వ నిమిషం వద్ద భారత క్రీడాకారిణి గుర్జిత్​ కౌర్ గోల్​ చేసింది. ఆ తర్వాత మ్యాచ్​లో ఆద్యంతం దూకుడు ప్రదర్శించిన రాణి రాంపాల్​సేన.. ప్రత్యర్థిని ఖాతా తెరవనీయకుండా అడ్డుకోగలిగింది. 

గ్రూప్​ దశలో వరుసగా 3 మ్యాచ్​లు ఓడినా కుంగిపోని భారత మహిళా హాకీ జట్టు.. చివరి రెండు మ్యాచ్​ల్లో గెలిచి క్వార్టర్స్​లో అడుగుపెట్టింది. ఒలింపిక్స్​లో భారత మహిళా హకీ జట్టు సెమీఫైనల్​కు చేరడం ఇదే తొలిసారి. 1980 మాస్కోలో జరిగిన విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి నాలుగో స్థానంలో నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత ఒలింపిక్స్​లో మళ్లీ ఆ స్థాయిలో ప్రదర్శన చేయడం విశేషం.  

గోల్​కీపర్​ సత్తా..

భారత మహిళల జట్టుకు చెందిన గోల్​ కీపర్​ సవితా పునియా.. ఆస్ట్రేలియా చేసిన ప్రయత్నాలను 9 సార్లు నిలువరించింది. ఈ విజయంలో ఎక్కువ శాతం ఘనత ఆమెకే చెందుతుంది. బుధవారం జరగనున్న సెమీఫైనల్​లో అర్జెంటీనాతో భారత మహిళా హకీ జట్టు తలపడనుంది.  

Last Updated :Aug 2, 2021, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.