ETV Bharat / sports

T20 World Cup: టీమ్​ఇండియా సెమీస్​ ఆశలు గల్లంతు

author img

By

Published : Nov 7, 2021, 6:42 PM IST

Updated : Nov 7, 2021, 7:10 PM IST

టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భారత్‌ సెమీస్‌ అవకాశాలు గల్లంతయ్యాయి. సూపర్‌-12 దశ నుంచే ఇంటిముఖం పట్టింది కోహ్లీసేన. అఫ్గానిస్థాన్​ విజయంతో న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ చేరడం వల్ల టీమ్​ఇండియా, నమీబియా మధ్య సోమవారం జరగాల్సిన మ్యాచ్​ ఇక నామమాత్రమే.

t20 world cup
t20 world cup

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) టీమ్​ఇండియా కథ ముగిసింది. మరో మ్యాచ్​ మిగిలుండగానే సెమీస్​ రేసు (Team India Semi Final) నుంచి నిష్క్రమించింది. ఆదివారం అఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో (NZ vs Afg) గెలిచి న్యూజిలాండ్​ సెమీస్​కు చేరింది. దీంతో కోహ్లీసేనకు సోమవారం నమీబియాతో జరగాల్సిన మ్యాచ్​ నామమాత్రంగా మారింది.

ఈ టీ20 ప్రపంచకప్​తో అంతర్జాతీయ టీ20ల నుంచి కెప్టెన్​గా వైదొలగనున్నట్లు విరాట్ కోహ్లీ (Virat Kohli News) ఇదివరకే ప్రకటించాడు. దీంతో కోహ్లీ సారథ్యంలో ఐసీసీ ట్రోఫీ కల ఈ టోర్నీతో తీరాలని టీమ్​ఇండియా క్రికెటర్లు సహా ఎందరో అభిమానులు ఆకాంక్షించారు. కానీ అది నెరవేరకుండానే టీమ్​ఇండియా ఇంటిముఖం పట్టింది.

ఆదిలోనే ఎదురుదెబ్బ..

కోహ్లీసేన ట్రోఫీ కలను ఆరంభంలోనే దెబ్బతీసింది దాయాదీ (Pakistan Cricket News) పాకిస్థాన్​. ప్రపంచకప్​లలో ఈ టోర్నీకి ముందు టీమ్​ఇండియాపై ఒక్కటంటే ఒక్క విజయం లేని పాక్​.. తొలిసారి భారత జట్టుపై (Ind vs Pak) గెలిచింది. ఆ మ్యాచ్​లో 10 వికెట్ల తేడాతో గెలిచి మనకు పరాభవాన్ని మిగిల్చింది.

ఆ తర్వాత న్యూజిలాండ్​తో మ్యాచ్​లోనూ (Ind vs NZ) టీమ్​ఇండియా భవిత మారలేదు. బ్యాటర్లు విఫలమైన వేళ 7 వికెట్లు కోల్పోయి 110కే కుప్పకూలింది భారత్. కివీస్​ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సెమీస్​ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో (Ind vs Afg T20) అప్గాన్​పై విశ్వరూపం చూపించింది టీమ్​ఇండియా. కేఎల్​ రాహుల్, రోహిత్ శర్మ చెలరేగి ఆడారు. దీంతో 66 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

స్కాట్లాండ్​తో (Ind vs Scotland) మ్యాచ్​లోనూ టీమ్​ఇండియా దుమ్మురేపింది. సెమీస్​ ఆశలను నిలబెట్టుకోవడానికి నెట్​రన్​రేట్​ పెంచుకోవాల్సిన తరుణంలో స్కాట్లాండ్​ను 85 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత 6.3 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది గ్రూప్​లోనే పాక్​ సహా మిగిలిన అన్ని జట్ల కన్నా అత్యుత్తమ నెట్​రన్​రేట్​ (+1.619) సాధించింది. 4 పాయింట్లతో టేబుల్​లో మూడో స్థానానికి చేరుకుంది.

ఆశ నెరవేరలేదు..

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్గాన్​తో కివీస్​ మ్యాచ్​కు ముందు.. 8 పాయింట్లతో ఉన్న పాక్ నేరుగా సెమీస్ చేరింది. 6 పాయింట్లతో (3 విజయాలు) ఉన్న కివీస్​.. అఫ్గాన్​పై గెలిస్తే నేరుగా సెమీస్​కు వెళ్తుంది (అదే జరిగింది). ఒకవేళ 4 పాయింట్లతో ఉన్న అఫ్గాన్ గెలిచి ఉంటే.. అప్పుడు భారత్​కు అవకాశం ఉండేది. సోమవారం నమీబియాతో జరగాల్సిన మ్యాచ్​లో కోహ్లీసేన గెలిస్తే.. టీమ్​ఇండియాకు 6 పాయింట్లు లభిస్తాయి. అఫ్గాన్​ కన్నా మెరుగైన నెట్​రన్​రేట్​ ఉంది కాబట్టి.. టీమ్​ఇండియా సెమీస్​ చేరుకునేది. కానీ, ఆ ఆశ నెరవేరలేదు.

ఇదీ చూడండి: అఫ్గాన్​పై న్యూజిలాండ్ విజయం.. ఇండియా ఇంటికి

Last Updated : Nov 7, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.