గ్రామస్థులు ఇచ్చిన డబ్బుతో ఒలింపిక్స్​కు.. పతకంతో స్వదేశానికి

author img

By

Published : Sep 24, 2021, 1:46 PM IST

Khashaba Jadhav

చెదరని దృఢ సంకల్పం, ఆటలో ఎలాగైనా గెలవాలన్న పట్టుదల.. అన్నింటికీ మించి పతకం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసం.. కానీ నిరుపేద కుటుంబం. ఒలింపిక్స్​లో అవకాశం వచ్చినా.. అక్కడికి వెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. మరి వీటన్నింటిని దాటి ఒలింపిక్స్​లో వ్యక్తిగత విభాగంలో రెజ్లర్​ కే.డీ.జాదవ్ పతకం ఎలా సాధించారు? అది ఎలా సాధ్యమైంది?

నిరుపేద కుటుంబంలో పుట్టినా.. తన ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో తాను కన్న కలలను నిజం చేసి చూపించారు ఖశబా దాదాసాహెబ్ జాదవ్. ఆయన రెజ్లింగ్​లో దిట్ట. జాదవ్​ రింగ్​లోకి దిగితే.. ప్రత్యర్థులకు హడలే. ఆయన ప్రతిభకుగాను 1952 సమ్మర్ ఒలింపిక్స్​కు ఎంపికయ్యారు. అదే ఒలింపిక్స్​లో కాంస్యం సాధించి.. ఒలింపిక్స్​ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన మొట్టమొదటి భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు.

Khashaba Jadhav
రెజ్లర్​ ఖశబా దాదాసాహెబ్ జాదవ్

ఒలింపిక్స్​కు అవకాశం ఎలా?

ఖశబా దాదాసాహెబ్ జాదవ్ మహారాష్ట్ర సతారాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించారు. జాదవ్ తండ్రి దాదాసాహెబ్ జాదవ్ ఓ రెజ్లర్. తండ్రి స్ఫూర్తితో ఐదేళ్లకే రెజ్లింగ్ నేర్చుకోవటం ప్రారంభించారు. 8ఏళ్ల వయసులోనే.. తోటి రెజ్లర్​ను రెండు నిమిషాల్లో ఓడించి సత్తా చాటాడు. అయితే.. ఒలింపిక్స్​లో బెర్తు కోసం చాలా కష్టాలే పడ్డాడు జాదవ్​. 5.5 అడుగుల ఎత్తున్న జాదవ్.. అప్పటి భారత ఫ్లైవెయిట్ ఛాంపియన్,6 అడుగులకు పైగా ఉన్న, బంగాల్​కు చెందిన నిరంజన్ దాస్​ను ఓడించి చరిత్ర సృష్టించారు​. దీంతో 1952 హెల్సింకి ఒలింపిక్స్​కు అర్హత సాధించారు.

Khashaba Jadhav
ఒలింపిక్స్ పతకం అందుకుంటున్న ఖశబా

గ్రామస్థుల అండతో..

ఒలింపిక్స్​కు వెళ్లేందుకు జాదవ్ దగ్గర డబ్బులేదు. దీంతో గ్రామస్థులే అన్నీ తామై.. రూ. 8 వేలు పోగు చేసి ఒలింపిక్స్​కు పంపించారు. హెల్సింకిలో జరిగిన 1952 సమ్మర్ ఒలింపిక్స్​లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. కాంస్య పతకాన్ని సాధించారు. దీంతో ఒలింపిక్స్​లో వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన మొట్టమొదటి భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు.

150 ఎడ్లబండ్లతో ఊరేగింపు..

కాంస్య పతకంతో కరదా రైల్వేస్టేషన్​లో దిగగానే.. దాదాపు 150 ఎడ్లబండ్లతో స్వాగతం పలికారు గ్రామస్థులు. 10 కిలోమీటర్లు ఊరేగించుకుంటూ వెళ్లారు.

Khashaba Jadhav
1952 హెల్సింకి ఒలింపిక్స్​లో రెజ్లర్​ ఖశబా

పోలీస్ అధికారిగా..

1952 ఒలింపిక్స్​ తర్వాత.. 1955లో పోలీస్ శాఖలో ఎస్సైగా చేరారు ఖశబా. 27 ఏళ్లపాటు అక్కడే పనిచేశారు. కొంతకాలం స్పోర్ట్స్​ కోచ్​గానూ సేవలందించారు. 1984, ఆగస్టు 14న(Khashaba Dadasaheb Jadhav Death) ఓ రోడ్డుప్రమాదంలో మరణించారు. 1992లో ఛత్రపతి పురస్కార్, 2001లో అర్జున అవార్డుతో ఖశబాను గౌరవించింది మహారాష్ట్ర ప్రభుత్వం. 'ఒలింపిక్ వీర్'(Olympic Veer) కేడీ జాదవ్ అని ఆయనపై ఓ పుస్తకాన్ని రాశారు సంజయ్ దుదానే.

ఇవీ చదవండి:

పారాలింపిక్స్​లో భారత తొలి స్వర్ణం వెనుక అంత కథ ఉందా!

టీ20 ప్రపంచకప్​ రికార్డుకు 14ఏళ్లు.. ఆ విశేషాలివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.