ETV Bharat / sports

చివరి గ్రాండ్‌స్లామ్‌ను విజయంతో మొదలుపెట్టిన సానియా.. టైటిల్​ సాధిస్తుందా?

author img

By

Published : Jan 19, 2023, 5:07 PM IST

తన కెరీర్​లో చివరి గ్రాండ్‌స్లామ్‌ను విజయంతో మొదలుపెట్టింది సానియా మీర్జా. ఆస్ట్రేలియన్ ఓపెన్ వుమెన్స్ డబుల్స్ తొలి రౌండ్​లో గెలిచి రెండో రౌండ్​లో అడుగుపెట్టింది.

sania mirza won first round in women doubles in australia open 2023
sania mirza won first round in women doubles in australia open 2023

హైదరాబాదీ టెన్నిస్ సెన్సేషన్ సానియా మీర్జా తన కెరీర్ లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెనే అని ఇటీవలే ప్రకటించింది. ఈ టోర్నీ తర్వాత ఆమె టెన్నిస్​కు గుడ్​బై చెప్పనుంది. ఇప్పుడీ గ్రాండ్‌స్లామ్ వుమెన్స్ డబుల్స్ తొలి రౌండ్​లో సానియా విజయం సాధించింది. తన డబుల్స్ భాగస్వామి ఏనా డానిలినాతో కలిసి బరిలోకి దిగిన సానియా.. అమెరికా, హంగరీ జోడీ బెర్నార్నాడా పెరా, డాల్మా గల్ఫీపై 6-2, 7-5 తేడాతో వరుస సెట్లలో గెలిచింది.

ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ వుమెన్స్ డబుల్స్​లో సానియా, డానిలినా జోడీ 8వ సీడ్​గా బరిలోకి దిగింది. తొలి సెట్​ను వీళ్లిద్దరూ కేవలం 25 నిమిషాల్లోనే 6-2తో గెలుచుకున్నారు. తొలి సెట్​లో సానియా తన ఫోర్ హ్యాండ్ షాట్లతో చెలరేగింది. రెండో సెట్​లోనూ మొదట్లోనే రెండు బ్రేక్స్ సాధించి 4-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత తడబడింది. ఆరో గేమ్​లో సానియా డబుల్ ఫాల్ట్​తో ప్రత్యర్థి జోడీ మళ్లీ పుంజుకుంది. అయితే చివరికి 7-5తో సెట్ తోపాటు మ్యాచ్​ను కూడా గెలుచుకుంది. వుమెన్స్ డబుల్స్ లోనే కాదు.. రోహన్ బోపన్నతో కలిసి సానియా మిక్స్‌డ్ డబుల్స్ లోనూ బరిలోకి దిగనుంది.

గతేడాదే తాను రిటైరవనున్నట్లు సానియా మొదట చెప్పినా.. గాయం కారణంగా యూఎస్ ఓపెన్​కు దూరం కావడంతో ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్​లో ఆడి తప్పుకోవాలని నిర్ణయించింది. మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన సానియా.. అందులో రెండు ఆస్ట్రేలియాలోనే గెలుచుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.