ETV Bharat / sports

టీ20ల్లో రోహిత్​ మరో రికార్డ్​.. భారత్​ నుంచి ఒకే ఒక్కడు

author img

By

Published : Jul 9, 2022, 7:45 PM IST

టీమ్ ​ఇండియా కెప్టెన్​ రోహిత్‌ శర్మ మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 300 ఫోర్లు కొట్టిన బ్యాటర్​ జాబితాలో చేరాడు. ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టీ20లో ఈ రికార్డు సృష్టించాడు. ఓవరాల్​గా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్​గా, టీమ్ ​ఇండియా నుంచి తొలి బ్యాటర్​గా నిలిచాడు.

Rohit and Kohli created a record by hitting 300 fours in international T20 cricket
టీ20 క్రికెట్‌లో రోహిత్‌, కోహ్లీ మరో ఘనత.. 300 ఫోర్లు కొట్టిన జాబితాలో..

టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్‌ శర్మ మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 300 ఫోర్లు కొట్టిన బ్యాటర్​ జాబితాలో హిట్​మ్యాన్​ చేరాడు. ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టీ20లో ఈ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌ బ్యాటర్‌ పాల్ స్టిర్లింగ్‌ 103 ఇన్నింగ్స్‌ల్లో 325 ఫోర్లతో టాప్‌లో ఉన్నాడు. రోహిత్​ రెండో స్థానంలో ఉన్నాడు.
భారత్​ తరఫున రోహిత్​ తొలి స్థానంలో ఉండగా.. విరాట్​ కోహ్లీ(298) ఫోర్లతో రెండో స్థానంలో నిలిచాడు. 191 ఫోర్లతో శిఖర్‌ ధావన్‌ మూడో స్థానంలో ఉన్నాడు. రెండో టీ20కి ముందు.. రోహిత్ ఖాతాలో 118 ఇన్నింగ్స్‌ల్లో 298 ఫోర్లు, 155 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్​తో రెండో టీ20లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. దీంతో మొత్తం 301 ఫోర్లు కొట్టాడు రోహిత్​.

టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్​.. భారత్​ బ్యాటింగ్​: టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌.. బౌలింగ్‌ ఎంచుకొని టీమ్‌ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్‌ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్​లో నిలవాలని చూస్తోంది.

భారత జట్టు : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), హార్దిక్‌ పాండ్య, దినేశ్ కార్తీక్‌, రవీంద్ర జడేజా, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రిత్‌ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్‌.

ఇంగ్లాండ్‌ జట్టు: జేసన్‌ రాయ్‌, జాస్‌ బట్లర్‌ (కెప్టెన్‌, కీపర్‌), డేవిడ్‌ మలన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, హ్యారీ బ్రూక్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరణ్‌, డేవిడ్‌ విల్లే, క్రిస్‌ జోర్డాన్‌, రిచర్డ్‌ గ్లీసన్‌, మాథ్యూ పార్కిన్‌సన్‌.

ఇదీ చదవండి: జడేజా చెన్నైని వీడనున్నాడా?.. క్లారిటీ ఇచ్చేసిన సీఎస్కే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.