ETV Bharat / sports

Ind Vs Ban Asian Games 2023 : బంగ్లాను చిత్తు చేసిన స్మృతి సేన.. ఇక భారత్​కు పతకం ఖాయం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 8:03 AM IST

Updated : Sep 24, 2023, 10:17 AM IST

Ind Vs Ban Asian Games 2023 : ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న క్రికెట్​ పోటీల్లో భారత మహిళల జట్టు తమ జోరును ప్రదర్శిస్తోంది. ఆదివారం జరిగిన సెమీస్​ పోరులో 52 పరగులకే బంగ్లాదేశ్​ జట్టును చిత్తు చేసింది.

Etv Bharat
Etv Bharat

Ind Vs Ban Asian Games 2023 : ఆసియా క్రీడలు మహిళల క్రికెట్‌ సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ సత్తా చాటింది. క్వార్టర్స్​లో ఓ పాయింట్​ అందుకుని సెమీస్​కు దూసుకెళ్లిన స్మృతి సేన.. ఆదివారం ఉదయం ప్రారంభమైన సెమీస్​లోనూ బంగ్లాదేశ్​ జట్టుపై అత్యద్భుత ప్రదర్శనను కనబరిచింది. 8 వికెట్ల తేడాతో బంగ్లా జట్టును చిత్తు చేసింది. టాస్​ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు.. 17.5 ఓవర్లకు.. 51 పరగులు స్కోర్​ చేసి ఆలౌట్ అయ్యారు.

Ind Vs Ban Womens Cricket : ఆ తర్వాత లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు కెప్టెన్‌ స్మృతి మంధాన (7), షెఫాలీ వర్మ (17) తడబడినా.. జెమీమా రోడ్రిగ్స్‌ (20*), కనికా (1*) నాటౌట్‌గా నిలిచి మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఇక భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లు తీసి రాణించగా.. టిటాస్​, అమన్​జోత్​, దేవికా, రాజేశ్వరి చెరో వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక సెమీస్‌లో సత్తా చాటడంతో టీమ్‌ఇండియాకూ పతకం ఖాయమైంది. ఫైనల్‌లోనూ గెలిస్తే టీమ్‌ఇండియాకు స్వర్ణమే.

India Women vs Malaysia Women : అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్స్​లో మలేసియాతో జరిగిన టీమ్​ఇండియా మ్యాచ్.. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 15 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 173 పరుగులు స్కోర్​ చేసింది. అయితే భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా.. రెండు బాల్స్ కూడా ఎదుర్కొక ముందే మ్యాచ్ ఆగిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్​ను రద్దు చేసిన మేనేజ్​మెంట్​.. ఇరు జట్లకు చెరో పాయింట్​ ఇచ్చారు. దీంతో మ్యాచ్ ర‌ద్ద‌యినప్పటికీ.. ర‌న్‌రేట్ ప్ర‌కారం టీమ్​ఇండియా సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మ్యాచ్​లో షెఫాలీతో పాటు జెమియా రొడ్రిగస్ రాణించి జట్టును విజయ పథంలోకి నడిపించారు. ఆడిన 29 బాల్స్‌లో ఆరు ఫోర్ల‌తో జెమియా 47 పరుగులు చేసింది. చివ‌ర్లో మైదానంలో దిగిన రిచా ఘోష్ ఏడు బాల్స్‌లోనే ఓ సిక్స‌ర్‌, మూడు ఫోర్లతో 21 పరుగులు చేసింది.

Asian Games 2023 Opening Ceremony : అట్టహాసంగా ఆసియా క్రీడల ప్రారంభోత్సవం.. ప్లేయర్స్​కు మోదీ విషెస్

Asian Games 2023 : ఆసియా గేమ్స్​లో తెలుగు తేజాలు.. గోల్డ్​ మెడల్​ టార్గెట్​గా బరిలోకి!

Last Updated :Sep 24, 2023, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.