టీ, బన్స్​ సప్లయర్​గా మాజీ క్రికెటర్.. కష్టాలు చూడలేక...

author img

By

Published : Jun 20, 2022, 2:11 PM IST

Updated : Jun 20, 2022, 3:02 PM IST

Former cricketer serves tea, buns amid fuel shortage in Sri Lanka
కష్టకాలంలో లంక్​ క్రికెటర్​ చేయూత.. టీ, బన్స్​ అందిస్తూ.. ()

ఆర్థిక సంక్షోభంతో పొరుగు దేశం శ్రీలంక అవస్థలు పడుతోంది. లక్షల మంది తిండలేక అలమటిస్తున్నారు. ఈ క్రమంలో తన చుట్టూ ఉన్న వారి ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చాడు ఆ దేశ మాజీ క్రికెటర్​ రోషన్ మహానమ. పెట్రోల్ బంక్​ల వద్ద గంటలు, రోజుల కొద్దీ బారులు తీరిన ప్రజలకు ఆహారాన్ని అందిస్తూ.. తన మంచి మనుసును చాటుకుంటున్నాడు.

ద్వీప దేశం శ్రీలంకలోని ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తిండి గింజల కోసం పూట పూటకు ఒక పోరాటమే చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం మొదలైనప్పటి నుంచి.. కష్టాలు పెరుగుతున్నాయి.. కానీ.. తగ్గడం లేదు. ఏది కొనాలన్నా.. గంటల కొద్దీ క్యూలైన్​లో ఉండాల్సిందే. దీంతో ఆ దేశ ప్రజలు నరకం చూస్తున్నారు. ఏం కొనాలన్నా ధరలు ఆకాశన్నంటడం వల్ల.. అనేక మంది నీళ్లతో కడుపులు నింపుకుంటున్నారు. ఈ క్రమంలో తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహానమ. తన దేశ ప్రజల కష్టాలను చూసి.. చలించిన ఆయన.. పెట్రోల్ బంకుల వద్ద క్యూలో నిల్చున్న ప్రజలకు టీ, బన్స్​ అందజేస్తూ.. వారి ఆకలిని తీరుస్తున్నాడు.

Former cricketer serves tea
టీ తీసుకెళ్తున్న రోషన్

పెట్రోల్ బంక్​ల వద్ద కిలోమీటర్ల మేర క్యూ ఉండటం వల్ల.. గంటల కొద్దీ, కొన్ని చోట్ల అయితే రోజుల కొద్దీ పెట్రోల్, డీజిల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో చాలా మంది ఆహారం కోసం అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహానమ తన వంతు సాయంగా.. టీ, బన్స్​ అందజేస్తున్నాడు.

Former cricketer serves tea, buns amid fuel shortage in Sri Lanka
టీ, బన్స్​ సప్లయర్​గా మహానమ
Former cricketer serves buns
బన్స్​ ప్యాక్​ చేస్తున్న రోషన్ మహానమ

కొలంబోలోని వార్డ్ ప్లేస్, విజేరామ మావత చుట్టూ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్‌లో నిలబడ్డ ప్రజలకు టీ, బన్స్ టీ, బన్స్​ అందజేశాడు మహానమ. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా తెలిపాడు. కమ్యూనిటీ మీల్ షేర్ ద్వారా ఉన్నవాళ్లంతా తోటివారికి సాయం చేయాలని అభ్యర్థించాడు. ఈ కష్టసమయాల్లో ఒకరికి ఒకరు సాయంగా నిలవాలని పిలుపునిచ్చాడు. 'బంక్​ల వద్ద క్యూలలో ఒకరినొకరు చూసుకోండి. ద్రవాలు, ఆహారాన్ని తీసుకురండి. ఎవరికైనా నలతగా ఉంటే.. పక్కనే ఉన్న సన్నిహిత వ్యక్తిని సంప్రదించండి. లేకుంటే.. 1990కి కాల్ చేయండి. ఈ కష్ట సమయాల్లో మనం ఒకరినొకరు చూసుకోవాలి' అని మహానామా ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు.

ఇదీ చదవండి: రుతురాజ్​, మెద్వెదేవ్​పై ఫ్యాన్స్​​ ఫైర్​.. అలా చేయడమే కారణం!

Last Updated :Jun 20, 2022, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.