ETV Bharat / sports

Asia Badminton: సెమీఫైనల్స్​కు దూసుకెళ్లిన పీవీ సింధు

author img

By

Published : Apr 29, 2022, 5:45 PM IST

Asia Badminton Championship Pv Sindhu: ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీసింధు మరో అడుగు ముందుకేసింది. గురువారం జరిగిన క్వార్టర్స్​లో గెలిచి సెమీ​ ఫైనల్స్​కు దూసుకెళ్లింది.

Asia Badminton Championship Pv Sindhu
Asia Badminton Championship Pv Sindhu

Asia Badminton Championship Pv Sindhu: ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు అదరగొడుతోంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో చైనాకు చెందిన హె బింగ్‌ జియావోపై 21-9,13-21,21-19 తేడాతో సింధు విజయం సాధించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండో పతకం ఖరారు చేసుకోవడానికి పీవీ సింధు మరో రెండు అడుగుల దూరంలో ఉంది.

ప్రపంచ 100వ ర్యాంకర్‌ యు యాన్‌ జస్లిన్‌ హుయ్‌ (సింగపూర్‌)తో గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 21-16, 21-16తో విజయం సాధించింది. ఇక పురుషుల డబుల్స్​లో సాత్విక్​ సాయిరాజ్​ రంకిరెడ్డి-చిరాగ్​ శెట్టి కూడా క్వార్టర్​ ఫైనల్స్​కు చేరారు. జపాన్​కు చెందిన అకిరా కోగా-తైచి సైతో ద్వయంపై 21-17 తేడాతో గెలిచారు. క్వార్టర్స్​లో ఐదో సీడ్​ అరోన్​ చియా-సో వూయ్​ ఇక్(మలేషియా)తో తలపడనున్నారు.

ఇదీ చదవండి: పీవీ సింధు.. బ్యాడ్మింటన్​లోనే కాదు ఆ విషయంలోనూ టాపే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.