ETV Bharat / sports

WTC FINAL 2023 : కేఎల్​ రాహుల్​ స్థానంలో మరో స్టార్​ ప్లేయర్!​.. అనౌన్స్​ చేసిన బీసీసీఐ

author img

By

Published : May 8, 2023, 5:32 PM IST

Updated : May 8, 2023, 10:57 PM IST

WTC FINAL 2023 : గాయంతో డబ్ల్యూటీసీ ఫైనల్​ జట్టుకు దూరమైన కేఎల్​ రాహుత్​ స్థానంలో మరో స్టార్​ ప్లేయర్​ను ఎంపిక చేసింది బీసీసీఐ. ఆ ఆటగాడు ఎవరంటే..?

wtc final 2023 india squad ishan kishan
wtc final 2023 india squad ishan kishan

WTC FINAL 2023 India Squad Ishan Kishan : గాయం కారణంగా ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​ షిప్​ ఫైనల్​ జట్టునుంచి స్వయంగా వైదొలిగాడు టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ కేఎల్​ రాహుల్. దీంతో డబ్ల్యూటీసీ జట్టులో ఖాళీ ఏర్పడింది. దీంతో కేఎల్​ రాహుల్​ స్థానంలో మరో ప్లేయర్​ను బీసీసీఐ సెలెక్షన్​ కమిటీ ఎంపిక చేసింది. ఆ ప్లేస్​లో ఇషాన్​ కిషన్​ను జట్టులోకి తీసుకుంది. ఇక స్టాండ్​బై ప్లేయర్లుగా రుతురాజ్​ గైక్వాడ్​, ముకేశ్​ కుమార్, సూర్యకుమార్​ యాదవ్​ ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో టీమ్ఇండియా విజయం సాధించింది. దీంతో డబ్లుటీసీ ఫైనల్​ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ ఫైనల్​ మ్యాచ్​ ఇంగ్లాండ్​ వేదికగా జూన్​ 7 నుంచి 11 వరకు జరగనుంది.

ఐపీఎల్‌ 16 సీజన్​లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ సారథి కేఎల్​ రాహుల్ గాయపడ్డాడు. అతడి కుడి తొడ పైభాగంలో గాయం అయింది. దీంతో అతడే స్వయంగా ఐపీఎల్​ నుంచి, డబ్ల్యూటీసీ ఫైనల్​ జట్టు నుంచి తప్పుకున్నాడు. అయితే, రాహుల్​ స్థానంలో టీమ్ఇండియా తరఫున ఒక్క టెస్ట్​ మ్యాచ్ కూడా ఆడని.. ఇషాన్​కు బీసీసీఐ ఎంపిక చేయడం విశేషం.

కాగా, జయదేవ్ ఉనద్కత్​కు గాయం అయింది. ఈ కారణంగా ప్రస్తుతం అతడు నేషనల్ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఉనద్కత్​ గాయం తీవ్రతపై పూర్తిగా స్పష్టత వచ్చిన తర్వాతే.. అతడు డబ్ల్యూటీసీ ఫైనల్‌ టీమ్​లో కొనసాగే అంశంపై క్లారిటీ వస్తుందని తెలిపింది. దాంతో పాటు మరో బౌలర్​ ఉమేశ్‌ యాదవ్‌ కూడా కేకేఆర్‌ మెడికల్​ టీమ్​ పర్యవేక్షణలో కోలుకుంటున్నాడని తెలిపింది. వారి దగ్గరి నుంచి తమ మెడికల్‌ టీమ్‌ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటోందని పేర్కొంది. మరో ప్లేయర్​ శ్రేయస్‌ అయ్యర్‌ వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్​ భరత్ (వికెట్​ కీపర్​), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఉమేశ్​ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్​ కీపర్).

Last Updated :May 8, 2023, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.