ETV Bharat / sports

విజేతకు రూ.32 కోట్లు- రన్నరప్​కు రూ.16 కోట్లు- వరల్డ్​ కప్​ ప్రైజ్​ మనీ వివరాలు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2023, 1:52 PM IST

Updated : Nov 19, 2023, 2:09 PM IST

World Cup 2023 Prize Money : వన్డే ప్రపంచకప్​ ఫైనల్​లో భాగంగా భారత్​ x ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో తుది పోరులో విజేతగా నిలిచిన వారికి ప్రైజ్​మనీ ఎంతంటే?

Etv Bharat
Etv Bharat

World Cup 2023 Prize Money : ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్​ చివర అంకానికి చేరుకుంది. గుజరాత్​లోని అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్​ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్​ మ్యాచ్​ జరుగుతోంది. ఈ క్రమంలో మెగాటోర్నీలో విజేతగా నిలువనున్న వారితో పాటు రన్నరప్స్​కు భారీ స్థాయిలో ప్రైజ్​ మనీ ఇవ్వనుంది ఐసీసీ.

  • విజేత - 40 లక్షల డాలర్లు (సుమారు రూ. 32 కోట్లు)
  • రన్నరప్ - 20 లక్షల డాలర్లు (సుమారు రూ. 16 కోట్లు)
  • సెమీఫైనల్స్​లో ఓడిన జట్టు - 8 లక్షల డాలర్లు (సుమారు రూ. 6.5 కోట్లు)
  • గ్రూప్ స్టేజ్​ తర్వాత నిష్క్రమించిన జట్టు - లక్ష డాలర్లు (సుమారు రూ. 82 లక్షలు)
  • గ్రూప్ స్టేజ్​లో నెగ్గిన ప్రతీ మ్యాచ్​కు - 40,000 డాలర్లు (సుమారు రూ. 32 లక్షలు).

World Cup 2023 Final Events : 2023 వరల్డ్​కప్​ ఫైనల్​ మ్యాచ్​ను బీసీసీఐ గ్రాండ్​గా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో వాయుసేన విన్యాసాలు, సెలబ్రిటీల పెర్ఫార్మెన్స్​లు జరగనుంది. ఎప్పుడెప్పుడు ఏయే కార్యక్రమాలు ఉన్నాయంటే..

  • మ్యాచ్ ప్రారంభానికి ముందు మధ్యాహ్నం 1.35 నుంచి 1.50 గంటల మధ్య వాయుసేన విన్యాసాలు జరిగాయి. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్‌ ఏవియేషన్ బృందం.. ఈ షో నిర్వహించింది.
  • తొలి డ్రింక్స్ బ్రేక్.. గుజరాత్​కు చెందిన ప్లేబ్యాక్ సింగర్ ఆదిత్య గాధ్వి.. పెర్ఫార్మెన్స్ ఉండనుంది. ఖలాసీ అన్ కోక్​ స్టూడియో సాంగ్​ ద్వారా ఫేమస్​ అయిన ఈ సింగర్​కు.. పలు గుజరాతీ సినిమాల్లో పనిచేసిన అనుభవం ఉంది. పలు భాషల్లోనూ ఆదిత్య పాటలు పాడాడు.
  • ఇన్నింగ్స్​ బ్రేక్.. తొలి ఇన్నింగ్స్ తర్వాత బ్రేక్ సమయంలో అద్భతమైన సాంస్కృతిక కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమంలో పాపులర్ సింగర్స్​.. ప్రీతమ్ చక్రబొర్తీ, జొనితా గాంధీ, నకాశ్ అజీజ్, అమిత్ మిశ్రా, అక్సా సింగ్, తుషార్ జోషి ప్రదర్శన ఉండనుంది.
  • రెండో డ్రింక్స్ బ్రేక్.. రెండో ఇన్నింగ్స్​ విరామం సమయంలో అత్యద్భుతమైన లేజర్ లైట్ షో ఉండనుంది.

భారత్ X ఆస్ట్రేలియా మ్యాచ్ - ఫైనల్​లో వీరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండనుందో!

12 ఫైనల్స్​ 6 శతకాలు - వరల్డ్​కప్​ హిస్టరీలో లాస్ట్ మ్యాచ్​ సెంచరీల హీరోలు

Last Updated :Nov 19, 2023, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.