ETV Bharat / sports

'వన్డే క్రికెట్​ అంతరించేలా ఉంది.. వాటిని తగ్గిస్తేనే మంచిది'

author img

By

Published : Jul 21, 2022, 1:20 PM IST

ఇకపై అంతర్జాతీయ షెడ్యూల్​లో వన్డేలకు ప్రాధాన్యం తగ్గిస్తే మంచిదని సూచించాడు దిగ్గజ బౌలర్​, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ వసీం అక్రమ్. ఇంగ్లాండ్​ ఆటగాడు బెన్​స్టోక్స్​ వన్డేల నుంచి తప్పుకోవడంపై స్పందిస్తూ.. అతడి నిర్ణయానికి మద్దతుగా నిలుస్తానని పేర్కొన్నాడు. వన్డే​ క్రికెట్​ అంతరించే స్థాయికి చేరుకుందని తెలిపాడు.

wasim akram
వసీమ్​ అక్రమ్

వన్డే కెరీర్‌కు బెన్‌స్టోక్స్‌ వీడ్కోలు చెప్పిన తర్వాత 50 ఓవర్ల క్రికెట్ మనుగడపై చర్చకు తెరలేచింది. వన్డేలను తగ్గించి టీ20లు, టెస్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే సూచనలు వస్తున్నాయి. ఈ క్రమంలో వన్డే ఫార్మాట్‌పై కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌ కూడా పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లో వన్డేలను తగ్గించేందుకు ప్రయత్నించాలని క్రికెట్ పాలక వర్గాలకు సూచించాడు. బెన్‌స్టోక్స్‌ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలిచిన అక్రమ్‌.. టీ20లతో పోలిస్తే వన్డే ఫార్మాట్‌ వల్ల ఆటగాళ్లు ఎక్కువగా అలసటకు గురవుతున్నారని వివరించాడు.

"బెన్‌స్టోక్స్‌ రిటైర్మెంట్ ప్రకటించడం బాధాకరమే కానీ.. అతడి నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నా. ప్రస్తుత సమయంలో వన్డే క్రికెట్‌ వేగంగా ప్రాభవం కోల్పోతోందని మాత్రం ఓ వ్యాఖ్యాతగా చెప్పగలను. మరీ ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌ పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ పొందుతోంది. 50 ఓవర్ల పాటు ఆడాలని ఏ ఆటగాడూ కోరుకోవడం లేదు. టీ20లు అలా కాదు. నాలుగే గంటల్లో మ్యాచ్‌ పూర్తి అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లు వచ్చేశాయి. భారీ మొత్తంలో సంపాదన లభిస్తోంది. అంతేకాకుండా, వన్డే క్రికెట్‌ వల్ల ఆటగాళ్లు ఎక్కువగా అలసటకు గురవుతున్నారు. అందుకే టీ20లు ఆడటం సులువు. టీ20 క్రికెట్‌ లేదా.. టెస్టు ఫార్మాట్‌ అడేందుకు మాత్రమే ప్లేయర్లు ఆసక్తి చూపుతున్నారు. వన్డే క్రికెట్‌ అంతరించే స్థాయికి చేరుకుంది" అని వసీం అక్రమ్‌ తెలిపాడు. స్వతహాగ తనకు టెస్టు ఫార్మాట్ అంటే ఎంతో ఇష్టమని అక్రమ్‌ పేర్కొన్నాడు. టెస్టుల వల్లే ఆటగాడి సామర్థ్యం వెలుగులోకి వస్తుందని, సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా రాణిస్తేననేది గొప్ప ప్లేయర్లుగా గుర్తింపు లభిస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వసీం అక్రమ్‌ సూచించాడు.

ఇదీ చూడండి : 'పంత్‌ లాంటి కెప్టెన్‌ ఉంటే టీమ్‌ఇండియాకు మంచిది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.